”శీతాకాలం వచ్చిందంటే చాలు.. కొంతమందికి ఊపిరి ఆడదు. ఇంకొంతమందికి ఉదయం బయటకు రావాలంటేనే చిన్నపాటి టెన్షన్.. అందుకే శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చలికాలం ఇబ్బందుల నుంచి గట్టు ఎక్కవచ్చు..”
ఆస్తమా వంటివి ఉన్నవారు ఉదయం పుట మంచుకురిచే సమయంలో బయటకు రావాల్సి వస్తే తలకు మాస్క్ వేసుకోవడం.. వంటి జాగ్రత్తలు పాటించాలి.
శీతాకాలంలో గుండెపోటు కేసులు ఎందుకు పెరుగుతాయంటే.. చలికాలంలో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంటుంది. దీనికి చలి కారణంగా రక్తపోటు పెరుగుతుంది. దీనితో గుండె పోటు రేటు పెరుగుతుంది. ఆరోగ్యమైన గుండెకు చలికాలం పెద్ద ముప్పే పొంచి ఉంది. ఈ సీజన్లో గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారపదార్థాలను తీసుకోవాలి. ఆహారంలో కూరగాయలు, గింజలు, పౌల్ట్రీ, తృణధాన్యాలు ఇటువంటి ఆహారాన్ని తీసుకోవాలి.
సరిపడినంత నీరు..
చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా సరే మంచినీరు తగినంత తీసుకుంటూ ఉండాలి. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరంలో సోడియం స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది.
జీవనశైలి మార్పులతో మానసిక ఆరోగ్యంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండెపై ప్రభావాన్ని చూపుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
దుస్తులు,
శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే, చలి నుంచి శరీరాన్ని కాపాడుకోడానికి ధరించే దుస్తులు కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ముఖ్యంగా ఈ కాలంలో లెదర్ దుస్తులు ధరిస్తే మంచిది.
వ్యాయామం..నడక
శీతాకాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు వ్యాయామం తప్పని సరి. గుండె ఆరోగ్యానికి ఇంటి లోపల వ్యాయామం చేయడం మంచిది. దీనికంటే ఎక్కువ రోజు క్రమం తప్పకుండా కనీసం రెండు కిలోమీటర్ల నడక తో ఎంతో .ప్రయోజనం ఉంటుందని డాక్టర్స్ చెపుతున్నారు.