‘ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న తమకు విశేష అధికారాలు ఉన్నాయని భావించినట్లున్నారు.. ఏకంగా విమానం ఏటీసి లోకి వెళ్లి టేకాఫ్ కోసం ప్రయత్నించారు..’
ఛార్టర్డ్ విమానం టేకాఫ్‌కు అనుమతి ఇవ్వాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులపై ఇద్దరు భాజపా ఎంపీలు ఒత్తిడి చేశారు. రాత్రి సమయంలో టేకాఫ్ చేసేందుకు అనుమతి లేదని, కానీ ఎంపీలు ఒత్తిడి తెచ్చి విమానంలో వెళ్లారని ఎయిర్పోర్ట్ డీఎస్పీ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
భాజపాకు చెందిన ఇద్దరు ఎంపీలపై పోలీసుల కేసు నమోదు చేశారు. ఛార్టర్డ్ విమానం టేకాఫ్ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఎంపీలు నిషికాంత్ దూబె, మనోజ్ తివారీపై ఈ కేసు నమోదైంది. ఎయిర్పోర్ట్ డీఎస్పీ ఫిర్యాదు మేరకు ఎంపీలు సహా 9 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇతరుల జీవితాలకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించడంతో పాటు, నియమాలు ఉల్లంఘించారన్న అభియోగాలు వారిపై మోపారు. ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.