ఓబుళాపురం అక్రమాలలో ‘గాలి ‘ శిక్ష నుంచి తప్పించుకుంటాడా ?

Rama Chandra P

గాలి జనార్దన్‌రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష

అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్‌ కేసులో (OMC) సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. గాలి జనార్దన్‌రెడ్డి సహా ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఏ2 గాలి జనార్దన్‌రెడ్డిని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. దోషులు అందరికీ ఏడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది.

ఏ3 వీడీ రాజగోపాల్‌ను, ఏ4 ఓఎంసీ కంపెనీని, ఏ7 మెఫజ్ అలీఖాన్‌ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. వీడీ రాజగోపాల్‌కు అవినీతి నిరోధక చట్టం కింద నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. ఏ4 ఓఎంసీ కంపెనీని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు, రూ.లక్ష, రూ.లక్ష చొప్పున రూ.2 లక్షల జరిమానా విధించింది.

ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏ2 గాలి జనార్ధన్ రెడ్డికి నాంపల్లిలోని సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అయితే వీరు పైకోర్టులకు అప్పీలుకు వెళ్లే ఛాన్స్ ఉంది . అక్కడ వీరికి ఇదే శిక్ష ఖరారవుతుందా ? లేదా తప్పుకుంటారా ? అనేది వేచి చూడాలి .

నిర్దోషులు: సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా తేల్చింది. 2004-09 మధ్య గనులశాఖ మంత్రిగా సబిత పనిచేశారు. సబితతో పాటు విశ్రాంత ఐఏఎస్‌ కృపానందంను నిర్దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. ఓఎంసీ కేసు విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. 2022లో ఏ6 శ్రీలక్ష్మిని తెలంగాణ హైకోర్టు కేసు నుంచి డిశ్చార్జి చేసింది.

తుది తీర్పు దశాబ్దంన్నర తర్వాత . . : ఓబుళాపురం మైనింగ్‌ కేసులో 15 ఏళ్ల తర్వాత తుది తీర్పు వచ్చింది. ఈ మధ్యలో ఎన్నో జరిగాయి . ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీలో ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పై 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.ఓబుళాపురం మైనింగ్‌ కేసు విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలంటూ గడువు విధించడంతో గత నెలలో వాదనలు ముగిసాయి. విచారణ దశలోనే ఏ5 లింగారెడ్డి మృతి చెందారు. 2022లో తెలంగాణ హైకోర్టు ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిని కేసు నుంచి డిశ్ఛార్జి చేసింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పై 2009లో సీబీఐ కేసు నమోదు చేసింది.

You May Also Like…