రాజధాని మారకుండా పార్లమెంటులో చట్టబద్దత హామీ అయినా ఇస్తారా?
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంబించి . .. ఏయే వరాలు ప్రకటిస్తారు? 2015లో అమరావతి శంఖుస్థాపన చేసినపుడు నీళ్లు – మట్టి ఇచ్చి తర్వాత చేతులు దులుపుకున్న అప్పటి NDA సర్కార్ . .. 2025 లో ఏమి చేయబోతోంది. ఇప్పటి వరకు వరల్డ్ బాంక్ నుంచి, ఇతర సంస్థల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు ఇప్పించారు . ఇంతవరకు బాగానే ఉంది . కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వబోయే పథకాలపై మోదీ క్లారిటీ ఇవ్వాలని ఆంధ్రప్రజలు కోరుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారు . దానిపై గట్టిగా అడిగే సత్తా ఉన్న నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కనిపించరు. 2019-2024 మధ్య అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సీబీఐ , ఈడీ కేసుల భయంతో స్పెషల్ స్టేటస్ గురించి కేంద్రాన్ని అడదకుండా దొంగాట ఆడేసారు .
ఇపుడు అధికారంలో ఉన్న చంద్రబాబు 2014-2019 మధ్య సీయంగా ఉన్నారు . చంద్రబాబుకు కేసుల భయం లేకపోయినా … మెతక వైఖరి అవలంబించి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు . ఇపుడు అడిగే పరిస్థితి ఉన్నా , , అమరావతి , పోలవరం పనులకు భారీగా నిధులు రాబట్టుకోవాలన్న కుతూహలంతో స్పెషల్ స్టేటస్ గురించి ఎలాగూ మోదీ ని అడగే పరిస్థితి ఉండదు .
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ఆధారపడి ఉందన్న విషయం తెలిసిందే . రాజకేయగ మన అవసరం ఉన్నా . .. ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి.
అమరావతికి చట్టబద్దత హామీ ఇస్తారా ? రాజధాని ఏర్పాటు సమయంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సపోర్టుగా మాట్లాడారు. 33 వేల ఎకరాలు కూడా సరిపోదన్నారు . 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని సర్వనాశనం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు . అమరావతిపైనా , ఆ ప్రాంతంలో ఒక సామాజిక వర్గంపైనా కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు . రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై రాక్షసత్వం చూపారు . దేవుడు కరుణించి వారి ఉద్యమం సక్సెస్ అయింది . వారి మనోభీష్టం మేరకు జగన్ ని ఆంధ్రప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు . ఇంతవరకు బాగానే ఉంది . చంద్రబాబు నాయుడు , కూటమి నేతలు తామే ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా అధికారంలో ఉంటామన్న భ్రమలలో తేలియాడుతున్నారు . అయితే ప్రజలు మాత్రం కొన్ని అనుమానాలలోనే ఉంటారు . ఆంధ్రప్రదేశ్ గ్రహపాటు బాగోక మరోమారు జగన్ అధికారంలోకి వస్తే . . పరిస్థితి ఏమిటి ? అన్న భయంలో మాత్రం కొందరు ఉన్నారు . వీరికి కూటమి ఎటువంటి భరోసా ఇస్తుంది . అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని మోదీతో ‘అమరావతి చట్టబద్దత ‘ హామీ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు . చంద్రబాబు ఈ పని చేయగలిగితే సక్సెస్ అయినట్లే . అమరావతి చట్టబద్దత అంశంపై మోదీ ఎటువంటి హామీ ఇవ్వకపోతే మాత్రం అమరావతి భవితవ్యంపై నీలినీడలు అలుముకునే ప్రమాదం పొంచి ఉంటుంది .
ప్రధాని మోదీ టూర్ షెడ్యూల్
ప్రధాని నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటిస్తారు. అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభిస్తుండటంతో ఈ పర్యటన కీలకంగా మారింది. ఈ సందర్భంగా మోదీ.. లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ….. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ శుక్రవారం మధ్యాహ్నం 2.55కి కేరళలోని తిరువనంతపురం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకి వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.15కి అమరావతి హెలిప్యాడ్‌కి చేరతారు. తర్వాత 3.25కి సభా వేదిక దగ్గరకు వెళ్తారు. మధ్యాహ్నం 3.30 నుంచి 4.45 వరకు అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అప్పుడే అమరావతి పెవిలియన్‌ను పరిశీలిస్తారు .