- కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన
- ఖాజీపేటలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగం
- నా వయసు 72… స్ఫూర్తి 27అంటూ కామెంట్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కడపలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని ఖాజీపేటకు వెళ్లగా… ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కార్యకర్తల ఉత్సాహాన్ని చూసిన చంద్రబాబు… తన వయసు, స్ఫూర్తిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. …నా వయసు 72 ఏళ్లు..అయితే నా స్ఫూర్తి మాత్రం 27… అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదన్న చంద్రబాబు… జాబ్ కేలండర్ ఏమైందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కడప జిల్లాకు ఒక్క పరిశ్రమనైనా తెచ్చిందా? అని కూడా చంద్రబాబు ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలోను యువతకు అధిక ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.