“కరోనా వచ్చి బయటపడ్డారా? హమ్మయ్యా .. బతికి బట్టకట్టాం .. ఇంకెంపర్వేలేదు..” అని ఆనందంతో గెంతులేస్తున్నారా? ఇక ఏ సమస్య రాదనుకుంటున్నారా? టెస్టులు కూడా చేయించుకున్నాం కదా.. నో ప్రాబ్లం.. అని ఉదాసీనంగా ఉంటే మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే.. అంటున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు. కోవిద్ నుంచి కోలుకున్నాక కూడా కొన్ని ఇబ్బందులు వీడని వారి ఊపిరితిత్తులలో లోపాలు గుర్తించినట్లు తాజా అధ్యయనంలో స్పష్టం అయింది. బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన ఎన్హెచ్ ఫౌండేషన్ ట్రస్ట్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.
కోవిద్ నుంచి కోలుకున్నాక శ్వాశ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు బాధితులను పరిశీలించారు. సిటీ స్కాన్ లో సహా అనేక ఇతర పరీక్షలు వీరు ఆరోగ్యాంగానే ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. కోవిద్ సోకినప్పుడు వీరు ఆసుపత్రులలో చేరలేదని, తెలిపారు. వీరి ఊపిరి తిత్తుల లోపాలను పరిశీలించడానికి వినూత్న జినాన్ గ్యాస్ స్కాన్ విధానాన్ని ప్రయోగించారు. అసలు లోపాలు దీంతో బయట పడ్డాయ్. వీరి ఊపిరి తిత్తులలో వాయు మార్పిడి సాఫీగా సాగడంలేదని వెల్లడైంది. ఇలాంటి లక్షనాలు నిర్దిష్ట కారణాలను గుర్తిస్తే మరింత సమర్థ చికిత్సలను అభివృద్ధి చేయడానికి వీలుంటుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.