“శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను నిరోధించే గుణం మెండుగా ఉందనే విషయం ఇది వరకే రుజువయింది. ఆరోగ్యాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయనేది కూడా చాలా కాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా చెపుతున్న అంశమే. అయితే జాతీయ పోషకాహర సంస్థ (ఎన్ఐఎన్)లోని వివిధ విభాగాలు, ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో మనం ఎగిరి గెంతేసే ఆనందించదగ్గ విషయాలు బయటపడ్డాయి.కరోనా వైరస్ ను అడ్డుకునే శక్తి ఇందులో ఉందని అధ్యయన బృందం వెల్లడించింది.
గ్రీన్ టీ లో ఎపిగాలో కాటెచిన్-3-గాలెట్ (ఈజీసిజీ) అనే పదార్ధం ఉంటుందట. ఇది బయట గాలిలో కలిసినపుడు ఆక్సికరణం చెంది వివిధ మ్యాలిక్యూల్స్ గా విడిపోతుంది. మానవ కణాలపై వీటిని ప్రయోగించినపుడు కోవిడ్ నియంత్రణకు ఇవి ఎంతగానో తోర్పాటు అందించాయి. రెండో దశ కోవిడ్ లో ఎక్కువమంది బాధితులు ఈ ప్రభావంతోనే చనిపోయారు. గ్రీన్ టీ లో ఉండే ఈజీసిజీ ఇతర మూలకాల ఇంఫ్లమ్మెటరే మార్కర్లను తగ్గించడంలో కీలకంగా మారుతున్నట్లు స్పష్టం అయిందని బృందం సభ్యులు తెలిపారు. ఊపిరితిత్తులలోని స్పైక్ ప్రోటీన్లను ఈజీసిజీ ఇతర మూలకాల ఇన్ఫలమేషన్ పెరిగి ప్రాణాల మీదకు వచ్చిన విషయాన్ని పరిశోధన బృందం గుర్తు చేసింది.ప్రాధమిక అధ్యయనంలో ఐఎల్-6 , ఐఎల్ 1 బీటా , టీ ఎన్ ఎఫ్ – గామా తదితర ఇన్ఫలమేటర్ మార్కర్లను సమర్ధంగా నిరోధిస్తున్నట్లు రుజువు అయిందని తెలిపారు. ..ఊపిరితిత్తులలోని స్పైక్ ప్రోటీన్లను, ఈజీసిజీ, కొన్ని మాలిక్యూల్స్ ను అడ్డుకున్నట్లు స్పష్టం అయిందన్నారు. కరోనా సోకిన వారు రోజు 3-4 కప్పుల గ్రీన్ టీ తాగడం చాలా మంచిదని సూచిస్తున్నారు. ఈ పరిశోధన బృందంలో శాస్త్రవేత్తలు మన్నే మునికుమార్., ఉంగరాల రామకృష్ణ, సురేష్ నారాయణ సిన్హా, ఆర్, శ్యాం సుందర్, చల్లా సురేష్, దిలేశ్వర్ కుమార్ ముఖ్య భూమిక పోషించారు. కరోనా రాకపోయినా రోజు ఒకటి, రెండు కప్పులు గ్రీన్ టీ తాగే అలవాటు చేసుకొనడం మంచిదే కదా…
గ్రీన్ టీ good.