రాజధాని ఫైల్స్ సినిమాపై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. వైయస్ఆర్ సీపీ నేత ఫిటిషన్ వేయడంతో కోర్టు స్టే విధించింది. సెన్సార్ సర్టిఫికెట్లతో పాటు అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నిర్మాతల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ రివిజన్ కమిటీ సూచనల మేరకు పలు సన్నివేశాలను తొలగించినట్లు చెప్పారు. ఆ తర్వాతే తమకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందన్నారు. రికార్డ్లను పరిశీలించిన కోర్టు అన్నీ సక్రమంగానే ఉన్నాయని పేర్కొంది.