మహా శివరాత్రి సందర్భంగా ‘శివ శక్తి’ గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్న ‘ఓదెల 2’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రం వారణాసిలో షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో తీసిన కొన్ని ఫొటోలను ఇటీవల దర్శకుడు సంపత్ నంది వేదికగా పంచుకున్నారు. ఇక 2022 వచ్చిన సూపర్‌హిట్ ఓటీటీ చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ అయిన ‘ఓదెల 2’ రాబోతోందని ఇటీవలే యూనిట్ ప్రకటించింది కూడా.
‘శివ శక్తి’ పాత్ర కోసం తమన్నా సాధువులా వేషం, ఒక చేతిలో కర్ర, మరో చేతిలో ఢమరుకం, నుదుటిపై పసుపు బొట్టు, దానిపై కుంకుమ బిందువుతో తమన్నా అచ్చం శివ శక్తిలానే కనిపిస్తుంది. కాశీ ఘాట్లలో ఆమె కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తాజాగా విడుదలైన పోస్టర్ ఉంది. నాగ సాధువుగా తమన్నా కనిపించనుంది. దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అశోక్ తేజ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.