ప్రభాస్ సరసన నాయికగా మృణాల్ ఠాకూర్ భారీ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.’సీతా రామం’ సినిమాతో నటనలో ప్రతిభ నిరూపించుకొంది. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకుంది. తర్వాత నుంచి ఎన్నో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ జోడీగా త్వరలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రానుంది.
తాజాగా ప్రభాస్ నుంచి నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి’, మారుతీ డైరెక్షన్ లో ‘రాజా సాబ్’ ఆడియన్స్ ను పలకరించనున్నాయి. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రభాస్ తన తదుపరి సినిమాను, హను రాఘవపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. కథానాయికగా మృణాల్ ఎంపిక జరిగిపోయిందనే అంటున్నారు.