హీరో గోపీచంద్ మంచి యాక్షన్ హీరో అనే విషయం తెలిసిందే. ఇటీవల రిలీజైన మూవీ భీమా. అయితే తనతో పాటు ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు గోపీచంద్. ప్రభాస్ తను చాలా మంచి ప్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోసం అనే ప్రశ్నకు స్పందిస్తూ .. ‘‘నిజం చెప్పాలంటే మా ఇద్దరికీ కోపం చాలా తక్కువ. కాకపోతే ఇద్దరం యాక్షన్ సినిమాలే ఎక్కువ చేస్తున్నాం. అందువలన అదే ఆవేశం బయట కూడా ఉండి ఉంటుందని చాలా మంది అనుకుంటారు’’ అని చెప్పాడు.
‘భీమా’ గురించి మాట్లాడుతూ .. ఇలాంటి సినిమాను నేను ఇప్పటివరకు చేయలేదు.. దర్శకుడు హర్ష స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నైట్ ఎఫెక్ట్ లో చేసిన ఫారెస్టు ఫైట్ గొప్పగా వచ్చింది. లవ్ .. కామెడీ టచ్ ఉన్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది” అని అన్నాడు.