టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ 109వ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను ఫిలింమేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది ‘కల్ట్ సరుకు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మూవీని బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు.
“ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా” అని విలన్ అడగ్గా… “సింహం నక్కల మీదికి వస్తే వార్ అవదురా లఫూట్… ఇటీజ్ కాల్డ్ హంటింగ్” అని బాలకృష్ణ తనదైన శైలిలో పలికిన డైలాగ్ స్ గ్లింప్స్ లో ఉన్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అర్ధాంగి సాయి సౌజన్య కు చెందిన ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీతో కలిసి ఆమె బాలకృష్ణ 109వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.