చుండ్రు.. జుట్టుకి సంబంధించిన చిన్న సమస్యగానే అనిపిస్తుంది కానీ, తెగ ఇబ్బంది పెట్టేస్తుంటుంది. దురద, హెయిర్ లాస్ ఇది తీవ్రమైతే కాస్తా కిందకి చేరి మొటిమలు కూడా ఏర్పడతాయి. ఇంత తీవ్రంగా కాకముందే ఈ డాండ్రఫ్‌ని తగ్గించుకోవడం మంచిది. ఇందుకోసం మన ఇంట్లో ఉండే వాటినే వినియోగించుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ జుట్టు సమస్యలలో చుండ్రు ఒకటి. ఆయుర్వేదంలో చుండ్రు నివారణకు అనేక సహజ పద్దతులు ఉన్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న రసాయన ఉత్పత్తులు ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, ఈ ఉత్పత్తులలో చాలా వరకు రసాయనాలతో నిండి ఉండటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ.
* వేప: “చర్మం యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ చుండ్రుకు కారణమైతే, క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉన్న వేప నూనె చుండ్రును కంట్రోల్న చేయడంలో ఉపయోగపడుతుంది. వేపలో యాంటీ ఫంగల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇందులోని యాంటీమైక్రోబయల్ గుణాలు చుండ్రుతో పోరాడతాయి. వేప ఆకులను పేస్ట్‌లా చేసి దానికి సరిపడినంత పెరుగు కలిపి తలకు అప్లై చేసి, 15-20 నిమిషాలు ఉంచి, ఆపై శుభ్రం చేసుకోండి. వేపలో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు పెరుగుతో కలిపి చుండ్రుతో పోరాడుతుంది.
- ఉసిరి విటమిన్ ‘సి’ అధికంగా ఉండే ఈ జ్యూస్ తలపై చుండ్రు పేరుకుపోకుండా చేస్తుంది. ఆమ్లా దాని విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో చుండ్రు ఏర్పడకుండా చేస్తుంది. ఇది చుండ్రు కారణంగా సంభవించే దురదను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. ఉసిరి పొడి పేస్ట్ చేసి దానికి, సుమారు 8-10 తులసి ఆకులను కలిపి గ్రైండ్ చేయాలి. దీనికి తలకు పట్టించి సుమారు 30 నిమిషాలు ఉంచుకోవాలి. చల్లని నీరు, తేలికపాటి షాంపూతో తలను శుభ్రం చేయాలి.
- గుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి , ఇది జుట్టు ఆరోగ్యానికి అవసరం. మరోవైపు విటమిన్ సి కూడా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. విటమిన్ సి వెంట్రుకల కుదుళ్లలోని కొల్లాజెన్‌ని పెంచడానికి సహాయపడుతుంది. ఇది స్కాల్ప్ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
- మెంతి గింజలు అధిక ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. ఇది జుట్టు రాలడం మరియు చుండ్రును నిరోధించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, జుట్టు పొడిబారడం, జుట్టు పల్చబడటం వంటి అనేక రకాల సమస్యలకు నివారిస్తుంది. ఈ మెంతి హెయిర్ మాస్క్‌ను అప్లై చేయడం వల్ల చుండ్రు చికిత్సకు సహాయపడుతుంది. జుట్టుకు, చర్మానికి.. మూడు టేబుల్ స్పూన్ల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం నానబెట్టిన మెంతి గింజలను గ్రైండ్ చేసి దానికి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ పేస్ట్‌ను మీ తలకు, జుట్టు చివర్లకు అప్లై చేయాలి. 30 నిమిషాలు ఉంచి తేలికపాటి షాంపూతో కడగాలి.
- కుంకుడు., షికాకాయ్: ఈ రెండింటిలో లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చుండ్రు కారణంగా వెంట్రుకలకు ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులను తొలగించడంలో ఇవి అత్యంత ప్రభావవంతంగా పని చేస్తాయి. కుంకుడు రసం,/ షికాకాయ్ రసం తో తలను 10-15 నిమిషాలపాటు మర్దన చేసి అరగంట తర్వాత తల స్నానం చేయాలి.
- వారానికి రెండు సార్లు తల స్నానం చేయాలి. తలను బాగా నానబెట్టి., వేళ్ళ గోర్లతో బాగా రుద్దాలి. ఇలా 15-20 నిమిషాల సేపు చేయాలి. కనీసం 6 వారాలపాటు ఇలా చేసిన 60-70 శాతం చుండ్రు సమస్య పరిష్కారం అవుతుంది.
- ఈ చిట్కాలతో చుండ్రు సమస్య చాలా వరకు తగ్గుతుంది.