భూమి మనుషుల నివాసానికి సరిపోకపోతే తర్వాత జరిగేది ఏమిటి? భూమి తర్వాత.. మనుషులు నివసించేందుకు అనుకూలంగా ఉన్న గ్రహంగా అంగారకాన్ని (Mars) చూస్తోంది నాసా. అక్కడ వ్యోమగాముల కోసం అల్ఫా ఇసుక తిన్నెపై ఓ భారీ ఇంటిని నిర్మించబోతోంది. ఆ ఇల్లు ఎలా ఉంటుందో.. టెక్సాస్.. హౌస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ లో ఆల్రెడీ నిర్మించింది. ఆ ఇంటిని చూసేందుకు మీడియాను అనుమతించింది. ఆ ఇల్లు లోపల ఎలా ఉందో చూడండి…