105 పెళ్లిళ్లతో గిన్నిస్ రికార్డ్.. అది కూడా ఇందులో ఏ ఒక్కరికీ విడాకులు ఇవ్వకుండానే..
మనిషన్నవాడు ఒక పెళ్లి చేసుకుంటాడు. ఏదైనా పొరపొచ్చాలొస్తే మొదటి జీవిత భాగస్వామికి విడాకులిచ్చి రెండో పెళ్లి.. అరుదుగా మూడోది కూడా ఉండొచ్చు. . కానీ ఈ వ్యక్తి.. అందరిలా కాకుండా 105 మంది మహిళలను పెళ్లి చేసుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సంపాదించాడు. బాబోయ్.. అన్ని పెళ్లిళ్లు ఎలా చేసుకున్నాడనుకుంటున్నారా?
అమెరికాకు చెందిన జియోవన్నీ విజ్ లియెర్టో అనే వ్యక్తి 1949 నుంచి 1981 మధ్య 105 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇందులో విచిత్రమేమిటంటే 105 మందిలో ఒక్కరు కూడా ఇతనికి విడాకులు ఇవ్వలేదట. ఇతను కూడా ఏ ఒక్క భార్యకి కూడా డైవోర్స్ ఇవ్వలేదట. లియార్ట్ వీరిలో మెజార్టీ మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. పేరు, చిరునామా తదితరాలు మార్చుకుంటూ ఇన్ని వ్యవహారాలు చక్కబెట్టాడు. అమెరికాలో 27 రాష్ట్రాలలో 14 దేశాలకు చెందిన వారిని ఇతగాడు పెళ్లాడాడు. పెళ్లి చేసుకున్న మహిళల నుంచి నగదు, బంగారం తీసుకుని ఉదయించేవాడు. ఆ డబ్బుతో మరొకరిని ట్రాప్ చేసేవాడు. ఇలా చేయడానికి ఎన్ని తెలివితేటలూ ఉండాలో కదా..