Abhi news
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • టూరిజం
  • మరిన్ని
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • టూరిజం
  • మరిన్ని
    • జనరల్
    • సోషల్ మీడియా
No Result
View All Result
Abhi news
అభిప్రాయం
Home ఆధ్యాత్మికం

ఆస్తులు వదులుకుని, ఆధ్యాత్మిక మార్గంలో

Chaitanya B by Chaitanya B
May 19, 2022
in ఆధ్యాత్మికం
ఆస్తులు వదులుకుని, ఆధ్యాత్మిక మార్గంలో

“డబ్బు సంపాదించి సుఖంగా ఉండటమే జీవితం కాదు. మనమేంటి? మనమెవరం? అని తెలుసుకోవడమే.,  జీవితం పరమార్థం. మానవుల కోరికలకు ఎప్పటికీ అంతం ఉండదు. మతం, ఆధ్యాత్మికత విలువల గురించి గురు మహేంద్ర సాగర్ మహరాజ్​, మనీశ్ సాగర్​తో గడిపినప్పుడు తెలుసుకున్నా. నా భార్య కూడా చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలనుకుంది. నా కుమారుడు కూడా నాలుగేళ్ల నుంచే ఇదే మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నాడు.  దీంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం.. ఇదేమీ సాహసం, త్యాగంతో కూడిన నిర్ణయం అని మేము భావించడం లేదు...”

–రాకేశ్​ సురానా, వ్యాపారవేత్త 

రూ.కోట్లు విలువ చేసే యావదాస్తిని విరాళంగా రాసిచ్చారు ఓ వ్యాపారి. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని  ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 22న జైపుర్​లో దీక్ష స్వీకరించనున్నారు.   

విరాళంగా రూ.కోట్ల ఆస్తి.. కుటుంబంతో కలిసి భౌతిక  ‘ప్రపంచానికి’ దూరంగా..!

 కోటీశ్వరులు తమ యావదాస్తిని దానం చేసి నిరాడంబర జీవితం గడిపే సన్నివేశాలను సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ మధ్యప్రదేశ్ బాలాఘాట్​లో ఇలాంటి ఘటన నిజంగా జరిగింది. ప్రముఖ ఆభరణాల వ్యాపారి రాకేశ్​ సురానా రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చారు. గోశాల, ఆధ్యాత్మిక సంస్థలకు వీటిని రాసిచ్చారు. అంతేకాదు విలాసవంతమై జీవితాన్ని వీడి తన భార్య లీనా సురానా(36), కుమారుడు అమయ్ సురానా(11)తో కలిసి ఆధ్యాత్మిక జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. గురు మహేంద్ర సాగర్ స్ఫూర్తితోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రాకేశ్​ సురానా. ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ఆయన కుటుంబాన్ని స్థానికులు రథంలో ఊరేగించారు. ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సన్మానించారు. వీరిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బాలాఘాట్​లో చిన్న దుకాణంతో రాకేశ్ సురానా ప్రస్థానం మొదలైంది. నిరంతరం శ్రమించి అంచెలంచెలుగా ఎదిగారు. డబ్బుతో పాటు స్థానికంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సకల సదుపాయాలతో విలాసవంతంగా జీవిస్తున్న ఆయన.. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు. రాకేశ్ సతీమణి లీనా సురానా మొదట అమెరికాలో చదువుకున్నారు. ఆ తర్వాత బెంగళూరు యూనివర్సిటీలో పై చదువులు పూర్తి చేశారు. 2017లో ఆమె తల్లి దీక్ష తీసుకున్నారు. కానీ క్యాన్సర్ వల్ల ఆ తర్వాత ఏడు రోజులకే ఆమె చనిపోయారు. లీనా సోదరి నేహ కూడా 2008లోనే దీక్ష చేపట్టారు. ఇప్పుడు వీరు ముగ్గురు…మే 22న జైపుర్​లో దీక్ష స్వీకరించనున్నారు.  ప్రాపంచిక సుఖాలను త్వజించి, ఆధ్యాత్మికతవైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్న ఓ నగల వ్యాపారి కుటుంబం స్ఫూర్తిని మనలో ఎంత మంది ఫాలో అవ్వగలం.. కనీసం ఊహించుకోగలం..  సన్యాసం స్వీకరించి, ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని నిర్ణయించుకోవాలనుకునే వారికి వీరు దిక్చుచి.

  ఇలాంటి వార్తలు చదవడానికి, చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి.. కానీ, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వారు మాత్రం నూటికి కాదు.. కోటికి కూడా ఒక్కరు ఉంటారంటారా? మనకు తెలిసిన వారెవరైనా ఇలా చేసారా? మనం చేయగలమా? ఆస్తి సమాజానికి కాదు.. మన పిల్లలకు , బందువులకు, తెలిసిన వారికీ ఇచ్చి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లగలమా? ఆలోచించండి…

Tags: Rakesh Surana:
ShareSendShareTweet
Previous Post

పూజారి కోసం కృష్ణుడు కూర్చున్నాడు

Next Post

AVOCADO అవకాడోతో.. గెండెపోటుకు చెక్

Related Posts

ఆ ముక్కంటికి ఏమి ఇష్టం ?
ఆధ్యాత్మికం

ఆ ముక్కంటికి ఏమి ఇష్టం ?

July 6, 2022
సెప్టెంబరు 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఆధ్యాత్మికం

సెప్టెంబరు 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

July 2, 2022
నాన్నతో గంగా నదిపై..రవీంద్రనాథ్ టాగోర్
ఆధ్యాత్మికం

నాన్నతో గంగా నదిపై..రవీంద్రనాథ్ టాగోర్

June 12, 2022
Next Post
AVOCADO అవకాడోతో.. గెండెపోటుకు చెక్

AVOCADO అవకాడోతో.. గెండెపోటుకు చెక్

Comments 1

  1. Nagendra PR says:
    2 months ago

    వాళ్ళు జీవిత పరమార్ధం గ్రహించారు..

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

You May Like

రాష్ట్రపతి రేసులో.. ఎంత మంది?

రాష్ట్రపతి రేసులో.. ఎంత మంది?

by Suryam Andaluri
June 30, 2022

ఆ 63 ఎకరాలు కియాకే కేటాయించారా?

ఆ 63 ఎకరాలు కియాకే కేటాయించారా?

by Suryam Andaluri
July 2, 2022

మానవ రహిత యుద్ధ విమానం

మానవ రహిత యుద్ధ విమానం

by V Srinivas
July 2, 2022

సెప్టెంబరు 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

సెప్టెంబరు 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

by Suryam Andaluri
July 2, 2022

Facebook Twitter Youtube

ABHINEWS.IN is one of the Leading Telugu News Portal that provides Latest News on Politics, Sports, Entertainment, Health and Movies.

Read More

Categories

  • For U
  • Uncategorized
  • అంతర్జాతీయం
  • అభిప్రాయం
  • ఆధ్యాత్మికం
  • ఆంధ్రప్రదేశ్
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • జనరల్
  • జాతీయం
  • టూరిజం
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • సోషల్ మీడియా

Pages

  • Contact
  • ఇ-పేపర్
  • Privacy Policy
  • Disclaimer

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved

No Result
View All Result
  • Home
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • సినిమా
  • క్రీడలు
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • టూరిజం
  • మరిన్ని
    • జనరల్
    • సోషల్ మీడియా

© 2021 AbhiNews Telugu News - All Rights Reserved