బిల్గేట్స్ కూతురి కొత్త అపార్ట్మెంట్.. ధర రూ.417 కోట్లు.. ఫొటోలు చూశారా?
మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, .. ప్రముఖ వ్యాపారవేత్త బిల్గేట్స్ పెద్ద కూతురు జెన్నీఫర్ గేట్స్ న్యూయార్క్లో ఓ కొత్త అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. అందుకోసం ఆమె రూ. 417 కోట్లు వెచ్చించారు. మన్ హాటన్ ప్రాంతంలో ట్రిబెకా సమీపంలో ఈ అపార్ట్మెంట్ ఉంది. 3,400 చదరపు అడుగుల టెర్రస్ ఉంది. మూడు అంతస్తులు కలిగిన ఈ గృహ సముదాయంలో 53 నివాస అపార్ట్మెంట్స్ ఉన్నాయ్. 6 బెడ్ రూమ్స్., 6 బాత్రూమ్స్, రెండు మినీ బాత్రూమ్స్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్నాయి.