ఒడిశా ప్రభుత్వం (Odisa Government) కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం (Independece Day) సందర్భంగా మహిళలకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థ ( Government and Private Firms) ల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు నెలసరి రోజులలో ఒకరోజు సెలవు (One Day Menstrual Leave) ఇస్తున్నట్లు ప్రకటించింది.
మహిళలు నెలసరి సమయంలో ఈ సెలవును మొదటి రోజు లేదా రెండో రోజు ఉపయోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు కటక్ లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం (Deputy CM) ఈ విషయాన్ని ప్రకటించారు. ఉద్యోగినుల ( Employees) ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కాగా ప్రస్తుతం బీహార్, కేరళ ప్రభుత్వాలు మహిళా ఉద్యోగులకు ఈ నెలసరి సెలవులు ఇస్తున్న సంగతి తెలిసిందే. బీహార్ (Bihar) లో ఈ సెలవుల విధానం 1992 లో ప్రారంభం కాగా అక్కడ ప్రస్తుతం ప్రతి నెలా రెండు రోజులు (Two Days) నెలసరి సెలవులు ఇస్తున్నారు. అలాగే కేరళ (Kerala) గత సంవత్సరం నెలసరి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.