నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. బాలకృష్ణ మాత్రం తన కొడుకు త్వరలోనే టాలీవుడ్ అరంగేట్రం చేస్తాడని ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ మాస్ డైరెక్టర్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పనిచేయనున్నట్టు తెలుస్తోంది. ఇది నిజంగా జరుగుతుందో లేదో వేచి చూడాలి. అయితే బోయపాటి నెక్ట్స్ మూవీ మోక్షజ్ఞతోనే ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.
స్క్రిప్ట్ డిస్కషన్స్ కూడా జరిగాయని, పుకార్లు రోజురోజుకు బలపడుతున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అఫీషియల్ అప్డేట్ ఇంకా రాలేదు. ‘ఆదిత్య 369’ సీక్వెల్ లో కూడా ఆయన నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు అవుతాడో లేదో చూడాలి. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. వెండితెరపై చాలా మంది స్టార్ కిడ్స్ ఫెయిల్ అవ్వడం చూశాం కానీ నందమూరి అభిమానులు మాత్రం ఆ ఒత్తిడిని మోక్షజ్ఞ సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు.