టాలీవుడ్ లో రచయితగా .. నిర్మాతగా ఎదిగిన కోన వెంకట్ కెరియర్ ఆరంభంలో వర్మ సినిమాలకు పని చేశారు. తాజాగా ఎన్టీవీ ఎంటర్టైన్ మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ గురించి ఆయన మాట్లాడారు.
“కొన్నేళ్ల పాటు సంసారం చేసిన తరువాత, జీవితంపై వైరాగ్యంతో సన్యాసం తీసుకునేవాళ్లు కొంతమంది ఉంటారు. వర్మ ఒక దర్శకుడిగా తానేమిటనేది ఈ ప్రపంచానికి చూపించాడు. డబ్బు .. కీర్తి ప్రతిష్ఠలు అన్నీ చూసేశాడు. ఇక ఇప్పుడు ఆయున చేసిన సినిమాలు చూస్తుంటే, సినిమాలపై ఆయన వైరాగ్యంతో ఉన్నాడేమోనని అనిపిస్తోంది” అని అన్నారు.
“వర్మ తాను చేస్తున్నది తప్పని ఎప్పుడూ అనుకోడు. ఎవరైనా చెప్పినా వినిపించుకోడు. అసలు చెప్పింది వినిపించుకోనివాడిపేరే వర్మ. పదిమందికి నచ్చే సినిమా కాదు .. నాకు నచ్చిన సినిమా తీస్తాను .. నచ్చితే చూడండి .. లేకపోతే లేదు అనే ఒక ఫిలాసఫీలోకి ఆయన వెళ్లిపోయాడు. తనకి నచ్చినట్టుగా బ్రతడం తెలిసిన ఏకైక జీవినే … ఆర్జీవీ అన్నారు.