జీవిత నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. అందువలన జీవిత – రాజశేఖర్ ఇద్దరూ కూడా కొన్ని వివాదాలను ఫేస్ చేయవలసి వచ్చింది. రాజశేఖర్ నేను ముక్కు సూటిగా మాట్లాడతాం.. అందువలన కొన్ని సమస్యలు ఎదురైన మాట నిజమే.. మా ఇద్దరి వరకూ అలా నడిచింది .. కానీ ఇప్పుడు పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మేమంటే పడనివారి వల్ల, మా పిల్లల కెరియర్ ఎఫెక్ట్ కాకూడదు. మా కారణంగా వాళ్లకి ఇబ్బందులు ఎదురుకాకూడదు. ఈ విషయాన్ని గురించి నేను .. రాజశేఖర్ గారు కలిసి మాట్లాడుకున్నాం అని జీవిత చెప్పారు.
“నేను .. రాజశేఖర్ గారు చాలా కెరియర్ చూశాము. ఇక ఇప్పుడు పిల్లల వంతు .. మేము లేకుండా వాళ్లు చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అందుకే నేను ఈ మధ్య కాస్త తక్కువగా మాట్లాడుతున్నాను. అయితే ఇది భయపడటం మాత్రం కాదు. ఎవరికీ భయపడే స్వభావం కాదు నాది అని చెప్పారు.