శోభన్ బాబు గురించి ప్రముఖ నటి.. ఒకనాటి టాప్ హీరోయిన్ జయసుధ ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. జయసుధ- శోభన్ బాబు కలిసి అనేక చిత్రాలలో నటించారు. అప్పట్లో వారిది హిట్ పెయిర్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో జయసుధ శోభన్ బాబు గురించి ప్రస్తావించారు.
ఆయనకు సమయస్ఫూర్తి ఎక్కువ. హీరోయిన్ రాధిక ఆయనను ‘బన్ బాబు’ అని పిలిచేది. తన ఆరోగ్యం విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవారు. డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటే భయపడేవారు .. డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడేవారు కాదని జయసుధ చెప్పారు. శోభన్ బాబుగారి దగ్గరికి చంద్రమోహన్ గారు వెళ్లినప్పుడు, ‘జయసుధను కాల్ చేయమని చెప్పు’ అన్నారట. ఆ విషయాన్ని చంద్రమోహన్ గారు నాకు చెప్పారు .. కానీ కొంచెం బిజీగా ఉండటం వలన చేయలేకపోయాను. వారం తిరిగేలోగా శోభన్ బాబుగారు చనిపోయారని తెలిసి షాక్ అయ్యాను అన్నారు జయసుధ.