కాకినాడ తీరానికి భారీ సొర చేప కొట్టుకొచ్చింది. దీన్ని స్థానికంగా బుక్క సొర చేపగా పిలుస్తారు. దాదాపు 25 అడుగుల పొడవున్న ఈ చేప 3 టన్నుల వరకు బరువు ఉంటుందని మత్స్యకారులు చెప్తున్నారు. తుఫాన్ వల్లే ఇది తీరానికి కొట్టుకు వచ్చిందని అంటున్నారు. కాకినాడ రూరల్ సూర్యారావుపేటలోని NTR బీచ్ వద్దకు భారీ చేప కొట్టుకువచ్చిన విషయం తెలిసి.. ఈ భారీ సొర చెప్పాను చూసేందుకు చుట్టుపక్కల జనం పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు.