వీలున్నంత వరకు అందరితో కలసిమెలసి ఉండు. వారిని ప్రేమించు. అనంతరం నీ అంతరంగంలోకి వెళ్లి శాంత్యానందాలు అనుభవించు. గోపబాలుడు తోలుకెళ్లిన ఆవులు పచ్చిక బయలును చేరుకోగానే అక్కడ ఉన్న మిగిలిన ఆవులతో కలిసిపోతాయి. అవి ఒకే మందకు చెందినవిగా కనిపిస్తాయి. కానీ మునిబాపు వేళ ఇంటికి తిరిగి వస్తున్నపుడు మళ్ళీ విడిపోతాయి. ఇలా నీ అంతరంగాన ‘ నీలో నువ్వు’ గా ఉండిపో.. – శ్రీ రామకృష్ణ పరమహంస