తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా నిలిచింది. ప్రేక్షకుల్లో బిగ్ బాస్ అంటే ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒక సీజన్ పూర్తయ్యాక.. మరో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఉత్కంఠతో చూస్తుంటారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ షో 5 సీజన్లు పూర్తయ్యాయి. కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్టార్ మా చానల్ దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ సీజన్-6 త్వరలోనే ప్రారంభం కానుందని స్టార్ మా తెలిపింది. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కూడా ఇటీవల ప్రారంభమయింది. అయితే అది అన్ని వర్గాలను చేరుకోలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాబోయే బిగ్ బాస్ షో సీజన్ 6 దుమ్మరేపనుందని అంచనాలున్నాయి. ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే..