నాసిరకం మద్యం స్కామ్ లో బాద్యులపై హత్యానేరం కింద క్రిమినల్ కేసులు సిద్ధం చేస్తున్నారా?
2019లో అధికారం చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధనదాహానికి ఆంధ్రప్రదేశ్ లో వందలమంది మందుబాబులు బలయ్యారు . వేలమంది అనారోగ్యంపాలై , రోగాలతో కునారిల్లడానికి నాసిరకం , కల్తీ మద్యం కారణమని చెప్పవచ్చు .
అప్పట్లో జరిగిన మద్యం కుంభకోణంపై కూటమి సర్కార్ ‘సిట్ ‘ వేసింది . ఈ కేసులో ఇప్పటివరకు పదిమంది వరకు అరెస్టయ్యారు . కీలక సూత్రధారులైన రాజ్ కసిరెడ్డి , సజ్జల రెడ్డి వంటి వారు అరెస్టయ్యారు . మరికొందరు అరెస్టవ్వడానికి సిద్ధంగా ఉన్నారు . ఇంతవరకు ఓకె . అయితే ఈ కేసును కేవలం ఆర్ధిక దోపిడీ వరకు చూసి వదిలేయడానికి లేదు . జగన్ సర్కార్ చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరి తరపున మద్యం కుంభకోణంలో సూత్రదారులు , పాత్రదారులపై హత్య నేరం కింద కేసులు పెట్టాలన్న డిమాండ్ రోజురోజుకీ ఎక్కువవుతోంది .
హత్య నేరం కేసులు
సీఎంగా అధికార పీఠం ఎక్కిన వెంటనే జగన్మోహన్రెడ్డి మద్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని సమూలంగా మార్చి తనకు, తన వారికి పాడి ఆవుగా చేసుకున్నారు. అప్పటి వరకు ఉన్న పాపులర్ బ్రాండ్లను పక్కనబెట్టి, కమీషన్లు ముట్టజెప్పిన కంపెనీల మద్యాన్ని మాత్రమే కొనుగోలు చేసే విధానాన్ని తీసుకువచ్చారు. ఊరూ పేరూ లేని కంపెనీలను సృష్టించి, వాటి ద్వారా నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేయించి ప్రభుత్వం తరపున కొనుగోలు చేశారు. ఫలితంగా పలువురు మద్యం ప్రియులు ప్రాణాలు కోల్పోగా, మరెందరో రోగాలు పాలయ్యారు. కుంభకోణానికి పాల్పడిన వారు కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము జేబులో వేసుకోవడంతోపాటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ కారణంగా దీన్నొక ఆర్థిక నేరంగానే కాకుండా ప్రజల చావుకు కారకులుగా గుర్తించి కేసు కట్టాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలి.
ఇసుకలో తిన్నారు . . లిక్కర్ లోనూ బొక్కేయలా ?
ఇసుక, మద్యంను సొంత ఆదాయ వనరులుగా మార్చుకోవడంలో జగన్ అండ్ కో ఆరితేరారు . అంతకు ముందు 2014-2019 మధ్య అధికారంలో ఉన్నపుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకలో మాత్రం బాగానే దండుకున్నారు . దీనిని గమనించిన జగన్ ఇసుక అక్రమాలలో మరో అడుగు ముందుకేసి వేల కోట్ల సమకూర్చుకోగలిగారన్న ఆరోపణలు ఉన్నాయి . ఇసుక వంటి వాటిలో దోపిడీని ప్రజలు సైతం పెద్దగా పట్టించుకోరు . అవసరమైన వాళ్ళు మాత్రం డబ్బు ఎక్కువ పెట్టాల్సిన వస్తుందని ఆ కాసేపు తిట్టుకుని వదిలేస్తారు . మద్యం విషయం అలా కాదు . . నాసిరకం మద్యం సరఫరా ద్వారా బోలెడంత డబ్బుతో పాటు . . అంతకు అనేకరెట్లు పాపం కూడా మూటకట్టుకున్న జగన్ అండ్ కో మాత్రం దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే . చంద్రబాబు సర్కార్ వదిలిపెట్టిన పైవాడు మాత్రం వదిలిపెడతాడా ? అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయ్ .
లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన వారితో పాటు విచారణకు హాజరైన నిందితులు చెప్పిన వివరాల ప్రకారం… ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరూ అమానవీయంగా వ్యవహరించారు. తమ ధనదాహం పేదల ఉసురు తీస్తుందన్న విషయాన్ని విస్మరించిన అధికారులు , అత్యున్నత పదవులు నిర్వహించిన వారు నాసిరకం మద్యంతో మరణించిన , అనారోగ్యంపాలైన కుటుంబాల ఆర్తనాదాలు తగలకుండా ఉంటాయా ? కర్మ ఫలం అనుభవించక తప్పదని మరువకండి .