ప్రత్యామ్నాయంగా ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్న వైద్య నిపుణులు
స్వీట్ల0టే చచ్చేంత ఇష్టమా? మీరు ప్రత్యేకంగా స్వీట్స్ తినకుండానే రోజూ మీ శరీరానికి అవసరమైనదానికంటే ఎక్కువే షుగర్ తింటున్నారు. ఔను మీరు విన్నది నిజమే… కూల్ డ్రింకులు, కాఫీ, టీ లు, జ్యుస్ లు, బ్రెడ్, కేకులు వంటి వాటిని రెగ్యులర్ గా తినడం ద్వారా అనేక కేలరీలు చక్కెర అదనంగా మీ ఒంట్లో చేరుతోంది.. గమనించండి..
తియ్యదనం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ రోజులో ఏదో రకంగా తీపిని తమ బాడీలోకి పంపిస్తూనే ఉంటారు. అది బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా సరే.. తీపి పదార్థం అనగానే ఎక్కువమందికి నోరూరడం సహజం. అయితే, దీని వల్ల బాడీలో షుగర్ కంటెంట్ ఎక్కువై . . అనేక ప్రమాదకరమైన రోగాలకు దారి తీస్తుంది .
రోజులో ఎంత చక్కెర తీసుకోవాలి? ఎంత పరిమాణంలో తీసుకోవాలి? అనేది పరిశీలిద్దాం… అధికంగా చక్కెర తీసుకుంటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, రోజుకు ఎంత పరిమితి మోతాదులో చక్కర తీసుకోవాలి? అంతకంటే ఎక్కువ తీసుకుంటే డేంజరేనా? చక్కెర శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది కానీ, అది అధికమైతే ఒబెసిటీ, డయాబెటిస్, కేన్సర్ , గుండె జబ్బులతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.
అనారోగ్య సమస్యలెన్నో!
ఒక మనిషి సగటున రోజుకు 25-32 గ్రాముల చక్కెర తీసుకోవచ్చన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు. కానీ, ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న భారతీయలు వినియోగంలో మాత్రం ముందున్నారు. బిస్కెట్లు, కూల్‌డ్రింకులు, చాక్లెట్లు, స్వీట్లు, కేక్‌ల రూపంలో ఎక్కువగా తీసుకుంటున్నారు. శరీరానికి పెద్దగా అవసరం లేకున్నా అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం, ఒబేసిటీ బారిన పడుతున్నారు.

‘’షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ముందుగా బరువు పెరుగుతాం. ఇది గుండెపోటుకు దారి తీస్తుండి. దీనిపై చాలామంది అశ్రద్దగా, నిర్లక్షయంగా ఉంటారు. ఇది కరెక్ట్ కాదు… ‘’ అని డాక్టర్ ఆదిత్య చౌతి చెబుతారు. ఆదిత్య బెంగళూరులోని ఇంటర్నల్ మెడిసిన్ ఫోర్టిస్ హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. షుగర్ ఫుడ్స్ తినడం వల్ల దంత సమస్యలు, క్యావిటీస్ వంటివి కూడా పెరుగుతాయి. అంతేకాకుండా శరీరంలో మంట పెరగడానికి షుగర్ కారణమవుతుంది. అందుకే చక్కెరతో నిండిన ఆహారానికి బదులు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల తక్షణ శక్తితో పాటు ఆరోగ్యం బావుంటుందని ఈ డాక్టర్ గారు సూచిస్తున్నారు. .
రోజువారీ జీవనశైలి, ఆహార మార్పుల కారణంగా మన దేశంలో సగటున 11-12 శాతం మంది ప్రజలు మధుమేహం బారిన పడుతున్నట్లు “ఐసీఎంఆర్-ఇండియా” అధ్యయనం వెల్లడించింది. పట్టణాల్లో 16శాతం, పల్లెల్లో 9శాతం మంది మధుమేహం బారిన పడుతున్నారని గణాంకాలు ప్రకటించింది. ఫలితంగా పక్షవాతం, గుండెజబ్బులు, పెరలాసిస్, కేన్సర్ , అధిక రక్తపోటు జబ్బులెన్నో తరుముకొస్తున్నాయని చక్కెర వెనుకున్న చేదు నిజాలను వెల్లడింది.
15 ఏళ్ల లోపు పిల్లలు రోజుకి 30 గ్రాముల లోపు చక్కర తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ ఏజ్ గ్రూప్ చిన్నారులలో ఎక్కువమంది రోజుకి సరాసరి.. 50-75 గ్రాముల షుగర్ తినేస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
తాజా పండ్లు మేలు . . చక్కరెకు ఆల్టర్ నేటివ్ గా ఫ్రెష్ ఫ్రూట్స్ మేలని చెపుతున్నారు . మోతాదులో షుగర్ న్ని ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి సరైన మొత్తంలో నియంత్రణ ముఖ్యమని సూచిస్తున్నారు. ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలు తగ్గించాలని, రోజూ సమతుల్య ఆహారంతో పాటు పోషకాలు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా అరటి , బొప్పాయి , దానిమ్మ , జామ , సీతాఫలం , రామాఫలం , లక్షణ ఫలం , వంటి దేశీయ పండ్లు మేలని ఇటీవల అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి .