ఇటీవల రిలీజైన బాలీవుడ్ మూవీ ‘యానిమల్’ దేశంలో చాలా సంచలనం సృష్టించింది. అందులో హీరోయిన్ గా నటించిన రష్మిక నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అయితే ఈ విజయాన్ని ఆమె అంత స్థాయిలో సొంతం చేసుకోలేక పోయారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో రష్మిక ఇన్ స్టా ద్వారా స్పందించారు.
తనపై ఉన్న ప్రేమతోనే ఈ ఆందోళన అని తనకు తెలుసునని కాని తన షూటింగ్ ల వల్లే ఆ విజయాన్ని ఆ స్వాదించలేకపోయానని చెప్పుకొచ్చారు రష్మిక. నా కెరీర్ లో కీలకమైన సినిమాల్లో నటిస్తున్నా.. వాటి కోసం పగలు, రాత్రి ప్రయాణాలు చేయాల్సి వస్తోంది.. అందుకే చాలా వేడుకల్లో పాల్గొనలేకపోతున్నానని నిరాశ వ్యక్తం చేశారు. నా ఫ్యాన్స్ నన్ను మిస్ అవుతారని తెలుసు.. అయితే నా సినిమాలు దానిని భర్తీ చేస్తాయని నమ్ముతున్నా అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప దిరూల్’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ సినిమాల్లో నటిస్తున్నారు.