స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘పుష్ప:ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. పక్క మాస్ గా రూపొందించిన ఒక కమర్షియల్ సినిమా ఇలాంటి సక్సెస్‌ను అందుకుంటుందా అనే రేంజ్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.
అయితే ఇక్కడే సుకుమార్ తనదైన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. స్క్రిప్టు పనుల్లో ఆలస్యం అయిన విషయం వాస్తవమే అయినా.. ఒక్కసారి షూటింగ్ మొదలుపెట్టాక ఎలాంటి గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్‌తో పుష్ప 2 చిత్రాన్ని పరుగులు పెట్టించేందుకు సుకుమార్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడట. ఈ మేరకు బన్నీని కూడా ఈ సినిమా షూటింగ్‌ను అనుకున్న సమయానికంటే ముందుగానే ఫినిష్ చేయాలని కన్విన్స్ చేశాడట. ఇక వీరిద్దరు కలిసి పుష్ప 2 చిత్రాన్ని ఒక్కసారి పట్టాలెక్కించగానే ఈ సినిమా షూటింగ్ పరుగులు పెట్టనుందని చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఏమాత్రం తగ్గేదే లే.. అంటూ సుకుమార్ తన సినిమాలోని డైలాగ్‌ను పదే పదే వాడేస్తున్నాడు. మరి నిజంగానే సుకుమార్ ఈ సినిమాను డిసెంబర్ నాటికి రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.