జనసేన అధినేత పవన్ పై ఆర్జీవీ మరోసారి కామెంట్స్ తో రెచ్చిపోయారు. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లను మాత్రమే టీడీపీ కేటాయించడంపై ఎక్స్ లో వర్మ సెటైర్ లు వేశారు. గత ఎన్నికల్లో జనసేన గెలవలేకపోడం వల్ల ఎక్కువ సీట్లను అడగలేకపోయానని పవన్ చెపుతున్నారని ఎద్దేవా చేశారు.
‘అజ్ఞాతవాసి’ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత సినిమా కూడా ఎక్కువ థియేటర్లలోనే విడుదలయిందని, థియేటర్ల సంఖ్య తగ్గలేదని చెప్పారు. కానీ రాజకీయాల విషయంలో పవన్ దీనికి విరుద్ధంగా వ్యవహరించారని, పవన్ కు తన రాజకీయ స్థాయిపై నమ్మకం లేదంటూ కామెంట్ చేశారు.