Good News to Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. మరో 20 లక్షల మందికి త్వరలోనే రుణమాఫీ – మంత్రి తుమ్మల

రాష్ట్రంలో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని, మరో 20 లక్షల మందికి ఆర్థిక వెసులుబాటు చూసుకుంటూ రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. రుణమాఫీపై తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టమైన వివరాలు చెబుతున్నప్పటికీ, బీజేపీ పెద్దలు, రాష్ట్ర నాయకులు (BJP Leaders create unnecessary confusion) రైతులను గందరగోళపరిచి, రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ‘రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 65.56 లక్షలు … Read more

GPS: జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరాతో గూఢచారి రాబందు కలకలం..

జీపీఎస్ ట్రాకర్, కెమెరాతో సంచరిస్తున్న  ఒక గద్ద  స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో గద్ద లాంటి పక్షి  స్థానికుల కంట పడింది. ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడూ కనిపించని ఈ వింత పక్షి కి జీపీఎస్ ట్రాకర్లతో పాటు కెమరాలు ఉండటం కలకలం రేపింది. మూడు రోజుల క్రితం చర్ల నాయక కాలనీ సమీపంలో గుట్ట వద్ద ఈ పక్షి కనిపించడంతో స్థానికులు గమనించి వెంటనే పోటోలు వీడియోలు తీశారు. … Read more

Hyderabad: ఆ బాధితులకు రూ.25వేల ప్రోత్సాహకం

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్న విషయం తెలిసిందే.  నిర్వాసితుల్లో చాలా మంది చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించే వారు. వారికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నా చాలా మంది దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తున్న చోటుకు వెళ్లేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.25వేలు ప్రోత్సాహకం అందించనుంది. ఇల్లు … Read more

KONDA SUREKHA: నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం.. కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.  హీరో నాగచైతన్య,  సమంత విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనని ఘాటుగా ఆరోపణలు చేశారు.  బాపూఘాట్ లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. కేటీఆర్ కు తల్లి అక్క, చెల్లి లేరా. . హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. మత్తుపదార్థాలు అలవాటు చేశారు. వాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారు. చాలా … Read more

Bathukamma: నేటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం

హైదరాబాద్: మహాలయ అమవాస్యరోజున (Mahaalaya Amavasya) బతుకమ్మ వేడుక మొదలవుతుంది. అంటే నేటి నుండి బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. 9 రోజులపాటు రోజుకు ఒక రకమైన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు తొమ్మిది రోజులు బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీ యువకులు పాల్గొంటారు. కానీ చివరి రోజు అయిన సద్దుల … Read more

Jani Master: అవార్డు అందుకోవాలి.. బెయిల్ ఇవ్వండి: జానీ మాస్ట‌ర్ పిటిషన్!

లైంగిక వేధింపుల కేసులో అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌ అరెస్టయిన విషయం తెలిసిందే.. అతడు బెయిల్ కసం ప్రయత్నాలు ప్రారంభించాడు.  అందులో భాగంగా తాను అవార్డు అందుకోవాల‌ని,  5రోజుల పాటు మ‌ధ్యంత‌ర‌ బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిష‌న్ దాఖలు చేశాడు. నార్సింగ్ పోలీసుల‌కు ఇచ్చిన నాలుగు రోజుల క‌స్ట‌డీ ముగియ‌డంతో జానీని మ‌ళ్లీ ఉప్ప‌ర‌ప‌ల్లి కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం అత‌డిని చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు. తనకు ఇటీవ‌ల ఉత్తమ‌ నృత్య‌ద‌ర్శ‌కుడిగా అవార్డు వ‌చ్చిందని.. దానికోసం ఢిల్లీ వెళ్లి అవార్డు … Read more

KTR: 2ల‌క్ష‌ల మందిని రోడ్డున ప‌డేయడానికే.. : కేటీఆర్

హైదరాబాద్ లో ప్రస్తుతం హైడ్రా డ్రామా హైలెవల్ లో నడుస్తోంది. ఆక్రమణలు అంటూ ప్రభుత్వం భవనాలను కూల్చివేస్తుంటే ప్రతిపక్షమైన బీఆర్ ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. బాధితులకు అనుకూలంగా మాట్లాడుతోంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి   మూసీ సందురీక‌ర‌ణ ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు. అది మరింత విమర్శలకు తావిస్తోంది. దానివ‌ల్ల సుమారు 2ల‌క్ష‌ల మందిని రోడ్డున ప‌డేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అంబ‌ర్‌పేట‌లో మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో … Read more

TS DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణాలో డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను స్వయంగా సీయం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ దసరా లోపు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామన్నారు. 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుండి ఆగస్టు 5 వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

TS High Court – HYDRA Commissioner: చార్మినార్ ఎమ్మార్వో చెబితే చార్మినార్ కూల్చేస్తారా.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు – HYDRA కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: అమీన్ పూర్ (Ameenpur) కూల్చివేతలపై విచారణ సందర్భంగా హైడ్రా (hydra) కమిషనర్ రంగనాథ్, అమీన్ పూర్ ఎమ్మార్వోపై (Ameenpur MRO) హైకోర్టు  (TS High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్ మండలం శ్రీకృష్ణానగర్లో మహమ్మద్ రఫీకి చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడంపై హైకోర్టుకు రంగనాథ్ (Ranganathan) వివరణ ఇచ్చారు. అమీన్ పూర్ కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని తెలిపారు. విచారణకు రంగనాథ్ ఇవాళ (సెప్టెంబర్ 30) ఉదయం హైకోర్టు ముందు వర్చువల్గా (virtual) హాజరయ్యారు. … Read more

Hydra: విచారణకు హాజరు కావాలి.. హైడ్రా కమిషనర్ కు హైకోర్టు ఆదేశం

అమీన్ పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు…. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్: అమీన్ పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు… హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.  అమీన్ పూర్ చెరువు FTL పరిధిలో ఉందని ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు.  కోర్టులో కేసు పెండింగ్ … Read more