శుభకార్యాలకు , పిల్లలకు ఏదైనా అకేషన్స్ కి ఇచ్చే బహుమతులకు అర్ధం పరమార్ధం ఉండాలని భావించారు ఈ దంపతులు . ఈ గిఫ్ట్ ల ద్వారా కొందరి జీవితాలలోనైనా ఉపాధి వెలుగులు నింపాలని సంకల్పం చేసుకున్నారు . కర్ణాటకకు చెందిన సునీతా, సుహాస్ రామేగోవ్డా అనే ఇద్దరు దంపతులు ది గుడ్ గిఫ్ట్స్ స్థాపకులు.. చిన్నతనం నుంచే బొమ్మల పట్ల ప్రేమ ఉన్న సునీత తన కళనే ఆదాయ వనరుగా మార్చి మరెందరికో ఉపాధి మార్గం చూపుతున్నారు . . ఈ జంట 2017లో బెంగుళూరుని వీడి నీలగిరికి వచ్చారు.. అక్కడ ఆదివాసి మహిళలు కష్టాలను చూశారు. వారికోసం ఏదైనా చేయాలి అనుకున్నారు.. “ఇండియన్ యార్డ్స్ ఫౌండేషన్”ను స్థాపించి 8000 కిలోల టెక్స్టైల్ వ్యర్థాలను ఫ్యాబ్రిక్ బొమ్మలుగా మార్చారు. ఆదివాసీ మహిళల జీవితాలను మార్చారు. వారికి బొమ్మలు తయారు చేయడం నేర్పించారు. ఈరోజు ఆ మహిళలు 2000 నుంచి పది వేల వరకూ సంపాదిస్తున్నారు అంటే వీరి కృషి అర్ధం చేసుకోవచ్చు . . 230 మంది ఆదివాసీ మహిళలకు సునీత, సుహాజ్ ఉపాధి కల్పిస్తున్నారు. 60 ఆఫ్‌లైన్ స్టోర్లలో ప్రతిరోజూ 3,000 బొమ్మలను అమ్ముతున్నారు. గత సంవత్సరం ₹75 లక్షల ఆదాయం సంపాదించారు. ఈ జంట వ్యర్థాలతో వ్యాపారం చేస్తూ పర్యావరణాన్ని కాపాడుతూనే మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. వీరి ఈ వినూత్న ప్రయాణం.. యువ పారిశ్రామికవేత్తలను ప్రేరేపించి. విజయవంతమైన వ్యాపారాలు సృష్టించడానికి ప్రేరణ కల్పించింది. ఈ సృష్టిలో పనికిరానిది అంటూ ఏది లేదు..దానికి క్రియేటివిటీ తోడయ్యే వరకు. ఏమంటారు..?
