TS DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణాలో డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాలను స్వయంగా సీయం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ దసరా లోపు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తామన్నారు. 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుండి ఆగస్టు 5 వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.