Tirumala: అక్టోబరు 17న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ..

తిరుమల: తిరుమలలో ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. రేపు (గురువారం, అక్టోబర్‌17న) పౌర్ణమి సందర్భంగా నెలవారీ గరుడసేవ జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Tirumala: తిరుమలలో వీఐపీ దర్శనాలపై భారీ వర్షాల ఎఫెక్ట్

భారీ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి .  వారం ,  పది రోజుల వ్యవధిలోనే వరుసగా రెండోసారి రాష్ట్రాన్ని భారీ వర్షాలు వెంటాడుతున్నాయి . తిరుమల వీఐపీ దర్శనాల కోసం వేచి ఉన్న భక్తులపైనే  భారీ వర్షాల ఎఫెక్ట్ పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు సైతం  అప్రమత్తమయ్యారు. టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులతో సమావేశం నిర్వహించారు. … Read more

 Vijayawada: రాజరాజేశ్వరీదేవిగా కనకదుర్గమ్మ దర్శనం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో  దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి.  పదో రోజైన శనివారం అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీదేవిగా  దర్శనమిస్తున్నారు. విజయ దశమి ఉత్సవాల చివరి రోజు కావడంతో తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరో వైపు భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఈ యేడాది  భవానీలు  అధిక సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకోవడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.   జై దుర్గ.. జై జై దుర్గ నామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో … Read more

CM Chandrababu Visits Indrakeeladri: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలను సమర్పించారు. కుటుంబ సమేతంగా దుర్గ గుడికి చంద్రబాబు విచ్చేశారు. వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ఆలయ సేవా కమిటీ సభ్యులను ఆయన మర్యాదపూర్వకంగా పలకరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి తలకు స్థానాచార్యులు శివప్రసాదశర్మ పరివేట్టం చుట్టారు. అనంతరం పట్టువస్త్రాలు తలపై పెట్టుకుని దుర్గమ్మ సన్నిధికి వెళ్లారు. దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు … Read more

Tirumala-Swarnarathotsavam: తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు – స్వర్ణ రథంపై ఊరేగుతున్న మలయప్పస్వామి

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారు రాముని అవతారంలో హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కాబట్టి ఈ ఇరువురిని చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుందని నమ్మకం. వరద హస్తం దాల్చిన వేంకటాద్రి హనుమంత వాహనంపై ఊరేగారు. రామావతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్వేద నిష్ణాతుడిగా, నవ వ్యాకరణ పండితుడిగా, లంకా భీకరుడిగా … Read more

TTD: సాక్షి యాజమాన్యంపై టీటీడీ ఫిర్యాదు.. కేసు నమోదు?

 ఏపీ మాజీ సీఎం సాక్షి యాజమాన్యంపై టీటీడీ ఫిర్యాదు చేయడంతో తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి కథనాన్ని ప్రచురించిందని టీటీడీ ఫిర్యాదులో పేర్కొంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ నెల 5న టీటీడీ అధికారులతో నిర్వహించిన సమీక్షకు సంబంధించి సాక్షి పత్రికలో అసత్య కథనాన్ని ప్రచురించిందని ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు … Read more

Sabarimala: అయ్యప్ప దర్శనానికి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సిందే.. 

కార్తీక మాసం రాబోతోంది. అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప స్వామి దర్శనానికి  ఇకపై ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని, అలా బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునే వీలుంటుందని ఇవాళ సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో  నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప భక్తులు పరమపవిత్రంగా భావించే మకరవిళక్కు సీజన్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది.  అయితే … Read more

Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నూతన పరదాలు సిద్దం

పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నూతన పరదాలు సిద్దం అయ్యాయి.ఈ నూతన పరదాలను అత్యంత భక్తిశ్రద్దలతో శ్రీ వేంకటేశ్వరస్వామి మాలధారణ ధరించి సిద్ధం చేస్తారు. తండ్రి.. గోవిందా అంటూ శ్రీవారి పట్ల తనకు ఉన్న అచంచలమైన భక్తిభావంతో తిరుపతికి చెందిన వాసు టైలర్స్ అధినేత మేకల సుబ్రమణ్యం ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో జరిగే నాలుగు పర్వదినాల్లో ఈ నూతన పరదాలు సమర్పిస్తుంటారు. ఉగాది … Read more

Hanuman:ఎవరి ద్వారా జరగాలో వారి ద్వారా . ..

”నేను కానీ ఆ సమయానికి అక్కడ లేకపోతే వాడికి చాలా ప్రమాదం జరిగేది . .”అని మనలో చాలా మంది చాలా సార్లు అనుకుంటూ ఉంటా0. రామ భక్తుడు హనుమంతుడు కూడా ఒకానొక సందర్భంలో ఇలా అనుకుని . .. వెంటనే . . తేరుకుని తన ఆలోచన కరెక్ట్ కాదని సవరించుకుంటూన్నాడు .  ఆ కథను మీరూ చదవండి . నేను లేకపోతే..? అశోక వనంలో రావణుడు… సీతమ్మ వారి మీదకోపంతో… కత్తి దూసి, ఆమెను … Read more

vamana: వామనావతారం ఏమి చెపుతోంది?

వామనావతారం గురించి ప్రవచన వాచస్పతి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనంలో ఘట్టాలు ఇవి . వామనావతారం . . విశిష్టత: కీలక ఘట్టం . . అమృతం సేవించడం ద్వారా మృత్యవు జయించవచ్చన్నది . అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వృద్ధాప్యాన్ని ,  మరణమును పోగొట్టుకున్న వారై మళ్ళీ సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు … Read more