Actress Kasturi: ఈ సారి త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు

నటి కస్తూరి మళ్లీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే తెలుగువారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి ఇబ్బందుల్లో పడింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కేసు నమోదవడంతో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు నటి కస్తూరి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలకు పాల్పడుతోందనే చర్చ సాగుతోంది. ఇలీవల సినీన‌టి క‌స్తూరి జైలుకు వెళ్లొచ్చింది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఓ మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. ఆమె ఈసారి తమిళనాడులో … Read more

Telangana: తెలంగాణ తల్లి రూపంలో మార్పు ఎందుకు?

తెలంగాణ పోరాటంలో భాగంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించారు. తమ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేందుకు గాను తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక చిహ్నంగా ముందుకు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహంపై విమర్శలు చేస్తూ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తీసుకొచ్చి ప్రత్యామ్నాయంగా మరో విధంగా విగ్రహాన్ని రూపొందించారు. దాని మీద … Read more

Indian Railways: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. విభజన హామీలలో ఇది కూడా ఉంది. ప్రస్తుతం కాజీపేటలో ఉన్న ఓవర్ హాలింగ్ వర్క్ షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్ గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్‌గ్రేడ్ చేయాలని గత ఏడాది జులై 5న దక్షిణ మధ్య రైల్వే జీఎంకి రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్ గ్రేడ్ చేసిన యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ … Read more

సామ్యవాద, లౌకిక పదాలపై సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయం: కుమారస్వామి

* 42వ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ లౌకిక సామ్యవాద సమగ్రత పదాలను చేర్చడంపై అభ్యంతరం చేయడం అర్థరహితమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లా కుమారస్వామి పేర్కొన్నారు.” రాజ్యాంగంలో సమానత్వ భావన అంతర్లీనంగా ఉంది. ప్రవేశికను సవరణ చేసే అధికారం పార్లమెంటుకు ఉంది” అని సుప్రీంకోర్టు చెప్పడం హర్షణీయమని ఆయన చెప్పారు. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించడం సమానత్వం అనే అంశాన్ని ఇది ప్రతిబింబిస్తుందని, లౌకిక స్వభావం … Read more

Congress: బీఆర్ఎస్ అసత్య ప్రచారం.. కాంగ్రెస్ ట్వీట్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయిందంటూ బీఆర్ ఎస్ చేస్తున్న ప్రచారం అసత్యమని కాంగ్రెస్ పార్టీ ఒక ఎక్స్ లో ఆరోపించింది. రాజధాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయంగా పురోభివృద్ధి సాధించిందని పేర్కొంది. ప్రముఖ స్థిరాస్తి కన్సల్టెన్సీ అన్ రాక్ వెలువరించిన రిపోర్టే దీనికి నిదర్శనమని తెలిపింది. తెలంగాణ అధికార పార్టీ శనివారం అన్ రాక్ కంపెనీ విశ్లేషణలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ లను జతచేస్తూ ఎక్స్ ల … Read more

Gachibowli: ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం.. ప్రాణ భయంతో జనం

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఓ నాలుగు అంతస్తుల భవనం మంగళవారం రాత్రి పక్కకు ఒరిగింది. బిల్డింగ్ కూలిపోతోందని భయాందోళనలకు గురైన జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ లో ఉంటున్న వారు ఉన్నపళంగా బయటపడ్డారు.  మణికొండకు చెందిన లక్ష్మణ్ రెండేళ్ల క్రితం సిద్ధిఖీ నగర్ లో తనకున్న 60 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవనం నిర్మించాడు. అందులో పలు కుటుంబాలు కిరాయికి ఉంటున్నాయి. మొత్తం 30 మంది ఆ బిల్డింగ్ లో ఉంటున్నారు. … Read more

Patnam Narender Reddy: పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు సీరియస్

లగచర్లలో అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన తీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వాకింగ్ కోసం కేబీఆర్ పార్కుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా తరలించారు. దీనిపై బీఆర్ఎస్ మండిపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం … Read more

Ramcharan: దర్గాను సందర్శించిన రామ్ చరణ్‌పై విమర్శలు

టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శింకున్చనారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన భార్య ఉపాసన స్పందించారు. రామ్ చరణ్ దర్గాను సందర్శించిన ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన ఉపాసన.. ‘‘విశ్వాసం ఒక్కటి చేస్తుంది.. అదెప్పుడూ విడదీయదు. భారతీయులుగా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలను గౌరవించాలి. ఐక్యతలోనే బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలను గౌరవిస్తారు’’  అని పేర్కొన్నారు.   ఉపాసన పోస్టుకు ఓ నెటిజన్ స్పందిస్తూ.. … Read more

Aghori: హైవేపై బైఠాయించిన అఘోరి..

ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో మహిళా అఘోరి హల్ చల్ చేసింది. జనసేన ఆఫీసు సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కల్యాణ్ ను కలిసేదాకా కదలనని తేల్చిచెప్పింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అఘోరి చేయిచేసుకుంది. అంతకుముందు మంగళగిరిలోని ఓ కార్ వాష్ సెంటర్ లో అఘోరి తన కారును శుభ్రం చేయించుకుంది. ఆ సమయంలో అక్కడున్న ఓ జర్నలిస్టు … Read more

air india: ఎయిరిండియా అదనపు సర్వీసులు

తెలుగు రాష్ట్రాల విమాన ప్రయాణీకులకు ఎయిరిండియా గుడ్ న్యూస్ చెప్పింది. శీతాకాల సర్వీసుల్లో భాగంగా అదనపు సర్వీసులను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి అదనపు సర్వీసులను ప్రకటించడంతో ఈ మూడు నగరాల నుంచి వారంలో నడిచే సర్వీసుల సంఖ్య 173 నుండి 250కి పెరిగాయి. కొత్తగా ప్రకటించిన సర్వీసుల్లో హైదరాబాద్ – గ్వాలియర్ డైరెక్ట్ సర్వీస్, విశాఖపట్నం – విజయవాడ సర్వీస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసుల సంఖ్య పెంచారు. అలానే … Read more