ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసు (Money Laundering Case) లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ (MLA Amanathulla Khan) అరెస్ట్ అయ్యారు. విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఈడీ (ED) ఆయనను అదుపులోకి తీసుకుంది.
ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ (Waqf Board Chairman) గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admy Party) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ పై పలు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈడీ సోదాలు (ED Raids) నిర్వహిస్తుండగా తనను అరెస్ట్ చేయడానికి వచ్చారంటూ ఆయన పేర్కొన్నారు. తనతో పాటు తమ పార్టీ నాయకులను కేంద్ర ప్రభుత్వం (Central Government) టార్గెట్ చేసిందని ఆరోపించారు. కొద్ది గంటల అనంతరం ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.