ప్రతినెల తరహాలోనే సెప్టెంబర్ (September) ఒకటో తేదీ నుంచి కూడా కొన్ని రూల్స్ (Rules) లో మార్పులు చోటు చేసుకున్నాయి. అవి ఏంటంటే…
ఫేక్ కాల్స్ మరియు మెసేజ్ (Calls and Messages) లను నియంత్రించడానికి టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ (TRAI) కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మేరకు టెలికాం ఆపరేటర్లు (Telecom Operators) అయిన జియో, వొడాఫోన్, ఐడియా, ఎయిర్ టెల్ మరియు బీఎస్ఎన్ఎల్ ఈ కఠిన మార్గ దర్శకాలను పాటించాలి. ఈ నేపథ్యంలో 140 మొబైల్ నంబర్ సిరీస్ ల నుంచి బ్లాక్ చెయిన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (Distributed Ledger Technology) ప్లాట్ ఫారమ్ కు టెలిమార్కెటింగ్ కాల్స్ మరియు వాణిజ్య సందేశాలను మార్చాలని ఆదేశాలు జారీ చేసింది.
దేశంలోని చమురు సంస్థలు ఎల్పీజీ సిలిండర్ (LPG Cyllinders) ధరల్లో మార్పులు ప్రకటించాయి. ఇందులో భాగంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.39 మేర పెంచుతున్నట్లు తెలిపాయి.
తరువాత ప్రైవేట్ బ్యాకింగ్ సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ (HDFC) తన క్రెడిట్ కార్డు (Credit Card) నియమాల్లో మార్పులను తీసుకువచ్చింది. ఈ మేరకు బ్యాంక్ యుటిలిటీ (Bank Utility) లావాదేవీలపై రివార్డ్ పాయింట్ల పరిమితిలో మార్పులు ఉండనున్నాయి.
అదే విధంగా మరో ప్రైవేట్ బ్యాకింగ్ సంస్థ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) ఈ నెల నుంచి క్రెడిట్ కార్డులపై చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో చెల్లింపు తేదీ కూడా గతంలో ఉన్న 18 నుంచి 15 రోజులకు తగ్గించబడుతుంది.
ఉచిత ఆధార్ అప్ డేట్ (Free Aadhar Update) కోసం చివరి తేదీ సెప్టెంబర్ 14వ తేదీగా కేంద్రం నిర్ణయించింది. గడువు ముగిసిన తరువాత ఎవరైనా కొన్ని విషయాలను మాత్రమే ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మాత్రమే వెసులుబాటు కల్పించింది. దాంతోపాటు 14వ తేదీ తరువాత ఆధార్ ను అప్డేట్ చేసుకోవడానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.