జమ్మూ (Jammu) లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అక్కడ అతిపెద్ద ఆర్మీ బేస్ (Army Base) గా ఉన్న సుంజావాన్ మిలిటరీ క్యాంపు (Sunjawan Military Camp) సమీపంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారని తెలుస్తోంది.
ఈ కాల్పుల ఘటనలో ఒక జవాన్ గాయపడ్డారని రక్షణ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ (Defense spokesman Lt. Col) తెలిపారు. ఈ ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ (Jammu and Kashmir) లోని కుప్వారా జిల్లా(Kupwara District) లో ఇటీవల చోటు చేసుకున్న రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు జరిగిన అతి కొద్ది రోజులకే ఆర్మీ బేస్ క్యాంపు (Base Camp Area) సమీపంలో దాడి జరిగింది.