Samantha: రెండో పెళ్లిపై స‌మంత షాకింగ్ కామెంట్స్‌

స్టార్ హీరోయిన్ స‌మంత.. నాగ చైత‌న్య‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోను వారి జంటకు అభిమానుల నుంచి మంచి ఆదరణ వచ్చింది. విడిపోతున్నారనే వార్తలు మొదలైన నాటి నుంచి తెలుగు మీడియాలో బాగా సంచలనం అయ్యారు. ప్రతి రోజు వారిపై ఏదో రూమర్ బయటకు వస్తూండేది. విడిపోయిన తర్వాత మరింత ఆసక్తి కరంగా మారారు. వారు ఏమి మాట్లాడినా, స్పందించినా సంచలనంగా మారుతూ వస్తోంది. అయితే తాజా సమంతా విడాకుల విషయంలో కీలక వ్యాఖ్యలు … Read more

Rail Corridor: శంషాబాద్ నుంచి విశాఖకు స్పీడ్ రైలు.. నాలుగు గంటల్లోనే..

హైదరాబాద్ నుంచి విశాకకు హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం ప్రక్రియ మొదలైనట్టు చెప్తున్నారు. ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తోంది. అది విశాఖకు చేరేందుకు 8:30 గంటలు పడుతోంది. అయితే అంతకంటే వేగం.. అంటే వందేభారత్ తో పోలిస్తే సగానికి కంటే తక్కువ సమయానికే విశాఖకు చేరుతుందని కొన్ని వర్గాల నుంచి సమాచారం.  హైదరాబాద్‌లోని శంషాబాద్-విశాఖపట్టణం (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ అలైన్‌మెంట్ ఖరారైంది. ఇది పూర్తయితే శంషాబాద్ నుంచి విశాఖపట్టణానికి కేవలం 4 … Read more

Khammam: అప్పు ఇచ్చిన బిచ్చగాడికి ఐపీ పెట్టిన ఘనుడు..

డబ్బుకోసం అన్ని వదిలేస్తున్నారు కొందరు. ఎంత వరకైనా దిగజారిపోతున్నారు. పైగా ఈ దారుణాలకు ఎక్కువగా పాల్పడేది డబ్బు, వ్యాపారాలు ఉన్నవాళ్లే కావడం మరింత దారుణం. అలాంటి ఘటనే ఖమ్మంలో చోటుచేసుకుంది. ఇది కూడా.. ఓ ముసలాయన.. ఒంట్లో సత్తువలేక బిచ్చగాడిగా మారాడు. ఓ గుడి దగ్గర యాచన చేస్తూ జీవితాన్ని సాగిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బులో కొంత బిడ్డ భవిష్యత్‌ కోసం దాచుకున్నాడు. ఆ డబ్బు తనకిస్తే అధిక వడ్డీ ఇస్తానంటూ ఆశ చూపాడు వ్యాపారి. తీరా … Read more

Telangana Politics: తెలంగాణలో పొలిటికల్ లీగల్ వార్.. శృతి మించుతున్న మాటల యుద్ధం..!

తెలంగాణలో నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.  అధికార పక్షం మరో వైపు ప్రతిపక్ష నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య విమర్శ ప్రతివిమర్శల మంటలు రాజుకుంటున్నాయి. అలాగే బీజేపీ నాయకులు కూడా  పలు అంశాలపై ఆరోపణలకు దిగుతున్నారు.  ఒకరిపై మరొకరు లీగల్ నడుస్తోంది. తమపై చేసిన ఆరోపణలకు ప్రతిగా లీగల్ నోటీసులు కూడా ఇచ్చుకొనే పరిస్థితి నెలకొంది. కొంతకాలంగా ఈ లీగల్ నోటీసుల పర్వం గట్టిగానే సాగుతోంది. అయితే … Read more

BRS: రైతు భరోసాకు ఎగనామం పెట్టారు.. కేటీఆర్, హరీశ్ రావు విమర్శలు

ఖరీఫ్‌లో రైతు భరోసా ఇవ్వలేమన్న ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో హోరెత్తించింది బీఆర్ఎస్‌ పార్టీ. అన్నదాతలతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలకు దిగింది. అన్ని మండలకేంద్రాల్లో జరిగిన ఆందోళనల్లో మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో కేటీఆర్, కరీంనగర్ జిల్లాలో హరీశ్‌రావు నిరసనకు దిగారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టారంటూ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్, హరీశ్ష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మాట్లాడుతూ రైతుబంధు కూడా ఇవ్వలేమని రేవంత్ సర్కార్ … Read more

ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎందుకు వెళ్లిపోతున్నారు ?

”ఆంధ్రజ్యోతి పత్రికలో 2008 నుంచీ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కె శ్రీనివాస్ తప్పుకుంటున్నారా ?  అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. నవంబర్ 1 నుంచి శ్రీనివాస్ తప్పుకుంటున్నట్లు చెపుతున్నారు .  గతంలో ఆంధ్రజ్యోతిలో పనిచేసిన ,  తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో కలసి డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేయడానికే కె శ్రీనివాస్ ఆంధ్రజ్యోతిని వీడుతున్నట్లు చెపుతున్నారు . ఎడిటర్ శ్రీనివాస్ రాజీనామా చేస్తే అసిస్టెంట్ ఎడిటర్ గా … Read more

Cheetah: అది చిరుత కాదు.. పిల్లి..  అట‌వీశాఖ క్లారిటీ

హైద‌రాబాద్‌లోని మియాపూర్ మెట్రోస్టేష‌న్ స‌మీపంలో చిరుత సంచారం అంటూ జ‌రిగిన ప్ర‌చారానికి తెరపడింది. దీనిపై  అట‌వీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. శుక్ర‌వారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ స‌మీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత సంచ‌రించ‌డం క‌నిపించింద‌ని స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అంతే కాదు నగరంలో ఈ ప్రచారం దుమారం రేపింది. అంతా చిరుత చిరుత అంటూ భయాందోళనలో పడ్డారు. స్థానికుల స‌మాచారంతో అట‌వీశాఖ అధికారుల‌తో క‌లిసి ఘ‌ట‌నాస్థ‌లికి వెళ్లిన పోలీసులు చిరుత కోసం గాలించారు. చిరుత పాద‌ముద్ర‌లను … Read more

Harishrao: హరీశ్ రావు బంధువులపై కేసు

తన భవనంలో దౌర్జన్యంగా ఉంటున్నారని ఓ బాధితుడు ఇచ్చని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బంధువులపై కేసు నమోదైంది.  తన ఐదంతస్తుల భవనంలో హరీశ్‌రావు బంధువులు తన్నీరు గౌతమ్, బోయినపల్లి వెంకటేశ్వరరావు, గోని రాజ్‌కుమార్‌గౌడ్, గారపడి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు అక్రమంగా ఉంటున్నారని బాధితుడు దండు లచ్చిరాజు మియాపూర్ పోలీసులకు ఇచ్చని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు తెలియకుండానే వారు తన ఇంటిని అమ్మేశారని, … Read more

Adulteration: పామాయిల్ తో పాలు.. కల్తీ పై యంత్రాంగం నిర్లక్ష్యం

” పామాయిల్.. ఎసిడిక్ యాసిడ్ ,  లిక్విడ్ గ్లూకోస్ . . ఇవీ కృత్రిమ పాలు తయారీకి ”మిల్క్ మాఫియా ‘  వాడుతున్న పదార్థాలు .  పాల లాంటి వాసన కోసం ఇందులో కొంచెం పాలపొడి . . అంతే వందలు ,  వేల లీటర్ల పాల తయారీకి తెగబడుతున్నారు కల్తీ దారులు . ” ముక్కుపచ్చలారని చిన్నారులకు ఈ పాలు పట్టిస్తే.. కల్తీ మాఫియా వాళ్ళు ఇది ఒక్కసారి ఆలోచిస్తే . . ఆ పాపం … Read more

Telangana Congress: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మరో నలుగురికి అవకాశం..?

హైదరాబాద్: గత డిసెంబరులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ త్వరాత మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరుగుతుందని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ జమ్ము  కశ్మీర్, హర్యానా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు ఎన్నికల బిజీలో ఉండిపోయారు. దాంతో వారు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ రాష్ట్రాల ఎన్నికలు పూర్తవడంతో … Read more