ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్ ఈవెంట్ లో సంచలనం నమోదైంది. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) 2007 ప్రపంచ కప్ సమయంలో నెలకొల్పిన రికార్డ్ బ్రేక్ (Record Break) అయింది.
ఒకే ఓవర్ లో 39 పరుగులు ( 39 Runs in One Over) తీసిన సమోవా వికెట్ కీపర్ డారియస్ విస్సర్ (Darius Visser) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వనాటు బౌలర్ నిపికో మూడు నో బాల్స్ సహా తొమ్మిది బంతులు వేయగా.. డారియస్ ఆరు సిక్సులు కొట్టాడు. దీంతో ఈ ఓవర్ లో మొత్తం 39 పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2007 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో యువీ రికార్డ్ బద్ధలైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది.