తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కౌంటర్ ఇచ్చారు. ఇందులో భాగంగా ‘ నా మాటలు గుర్తుపెట్టుకో ఛీప్ మినిస్టర్ (Chief Minister)’ అంటూ రేవంత్ రెడ్డిని ఆయన హెచ్చరించారని తెలుస్తోంది.
అధికారంలోకి వచ్చిన తొలి రోజే సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామని కేటీఆర్ అన్నారు. నీలాంటి ఢిల్లీ గులాములు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ (Telangana) ను అర్ధం చేసుకోలేరని విమర్శించారు. చిన్న పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తుందని విమర్శలు చేశారు. ఇకనైనా రేవంత్ రెడ్డి మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.