మంగళవారం తెల్లవారుఝామున హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి . దీంతో ఆఫీసులకు , స్కూల్స్ , కాలేజీలకు, ఇతర పనులకు వెళ్లాల్సిన జనం మెట్రో రైళ్లను ఆశ్రయించారు . మెట్రో లేకపోతే ఇలాంటి భారీ వర్షాలు కురిసినప్పుడు హైదరాబాద్ జనం పరిస్థితి ఏమై ఉండేది . ..??
భారీ వర్షాలకు హైదరాబాద్ – సికింద్రాబాద్ నగరాల ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో ఈ రెండు నగరాల వాసులు కార్లు , మోటార్ సైకిళ్ళు , ఆటోలు , క్యాబ్‌లు వదిలి మెట్రో రైళ్లను ఆశ్రయించారు .
ఓ మోస్తరు వర్షం కురిస్తే హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలలో జనం దుస్థితి చెప్పనలవికాదు . చెరువులు , కాల్వలు ఆక్రమణలకు గురికావడం,, డ్రైనేజీలలో ప్లాస్టిక్ వ్యర్ధాలు పేరుకుపోవడం వంటి కారణాలతో భారీ వర్షాలకు జంట నగరాల రోడ్లు కాల్వలను తలపిస్తుంటాయ్ . . దశాబ్ద కాలంగా భాగ్యనగరం పరిస్థితి ఇంతే . హైదరాబాద్ మహానగరంగా విస్తరించి . .. 100 కిలోమీటర్ల మేర వ్యాపించినా . . ప్రధాన నగరంలో మాత్రం ఈ పరిస్థితి ఇప్పట్లో మారేలా కనిపించడంలేదు .
భాగ్యనగరం ముంపుపై పరిష్కారంపై ప్లాన్ ఏదీ ? హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల ముంపు సమస్య నుంచి బయటపడే మార్గం కనిపించడంలేదు . దశాబ్దాలుగా చెరువులు , డ్రెయిన్స్ ఆక్రమణలకు గురికావడం , నగరంలో ప్లాస్టిక్ వినియోగం ఏటేటా అనేక రేట్లు పెరుగుతుండటం . . ఆ చెత్తను డ్రెయిన్స్ లో వేయడం వంటి వాటిని అరికట్టకుండా భాగ్యనగరాన్ని ముంపు నుంచి బయటపడే పరిస్కారం దొరకదు . అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది . . అనుకోవడం కంటే . . ఎవరికీ వారు తమ బాధ్యతలను కూడా గుర్తెరిగితే కానీ ఇలాంటి సమస్యలకు పరిస్కారం దొరకదు .