Rashmika Mandanna: ఆ వింగ్ కు రష్మిక బ్రాండ్ అంబాసిడర్

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నకు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా అగ్రహీరోయిన్ల జాబితాలో ఉంది రష్మిక. సినిమాలతో పాటు పలు సామాజిక సేవ కార్యక్రమాల్లో నూఆమె పాల్గొంటుంది.  కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ వింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మికను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తూ, తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తనకు ఇలాంటి గౌరవం, బాధ్యతను అప్పజెప్పిన కేంద్ర … Read more

Northeast Monsoon:  ముందే వచ్చిన ఈశాన్య రుతుపవనాలు

భారత దేశానికి ఎంతో కీలకమైన నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.    నైరుతి బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణాంధ్ర తీరంలో తుపాను biఏర్పడే అవకాశం ఉందని, మధ్య పశ్చిమ అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం వచ్చే ఆరు గంటల్లో … Read more

PM Modi IMC 2024: టెక్నాలజీ వినియోగంలో నిబంధనలు పాటించాల్సిందే: ప్రధాని మోడీ

ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విషయంలో నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్లోబల్​ ఇన్​స్టిట్యూషన్స్​ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ టెలీకమ్యూనికేషన్‌ స్టాండర్డైజేషన్‌ అసెంబ్లీ-2024 (WTSA 2024) ఈవెంట్‌ ఢిల్లీలోని భారత్​ మండపంలో ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే దేశీయ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు నిర్వహించే ఇండియన్‌ మొబైల్ కాంగ్రెస్‌ ఈవెంట్‌ 8వ ఎడిషన్‌ను కూడా ఈ కార్యక్రమంలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … Read more

ITBP Constable Driver Recruitment 2024: 10th అర్హతతో ఐటీబీపీలో 545 కానిస్టేబుల్‌ కొలువులు – దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే ?

Government Jobs:  ప్రభుత్వరంగ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. పదవ తరగతి​ అర్హతతో ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) 545 కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) గ్రూప్‌ సి నాన్‌ గెజిటెడ్‌ (నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టులు భర్తీ చేయనుంది. ఈ మేరకు పోస్టులకు సంబంధించిన ప్రకటనను విడదల చేసింది. దీనికి కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకున్నప్పటికీ శాశ్వత విధుల్లోకి మార్చవచ్చు. అన్‌రిజర్వ్డ్‌ కేటగిరీలో 209 పోస్టులు, ఎస్సీ 77, ఎస్టీ … Read more

Lawrence Bishnoi Gang: ముంబయిని గడగడలాడిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్

ముంబయి: ముంబయి అండర్‌ వరల్డ్‌ మళ్లీ యాక్టీవ్‌ అయ్యిందా అంటే అవును అనే సమాధానమే వస్తోంది. గతంలో ముంబై చీకటి సాజ్రమ్యాన్ని లీడ్ చేసిన డీ-కంపెనీ దాదాపు ఫేడవుట్ అయిపోవడంతో ఇప్పుడు కొత్త గ్యాంగ్ ఎంటరైంది. అండర్‌ వరల్డ్ కి నయా దావూద్‌ వచ్చాడు. అతను ఉండేది జైల్లో అయినా జరిగే హత్యలు జరిగిపోతుంటాయి. కటకటాల్లో ఉంది కూడా ఏడు దేశాల్లో నెట్‌వర్క్‌ మెయింటేన్‌ చేస్తున్నాడు. ఫైనాన్స్ క్యాపిటల్‌ని గడగడలాడిస్తున్న ఈ కిల్లర్‌ ఎవరు? ఎక్కడి నుంచి … Read more

Salman Khan – Bishnoi: సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెబితేనే…లేదంటే – బిష్ణోయ్ సంఘం

ముంబయి: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు గురికావడంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‏కు బాబా సిద్ధిఖీ స్నేహితుడని.. వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. 1999లో విడుదలైన ‘హమ్ సాత్ సాత్ హై’ సినిమా షూటింగ్ కోసం 1998లో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ వెళ్లారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణజింకను వేటాడాడు. ఈ కేసులో … Read more

Murder Case – Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య కేసు..అతడు మైనర్ కాదు..!

ముంబయి: ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, సల్మాన్ ఖాన్  స్నేహితుడు బాబా సిద్ధిఖీ (Baba Siddique) హత్య కేసులో నిందితుడైన ధర్మరాజ్ కశ్యప్ మైనర్ కాదని తేలింది. హత్య కేసులో నిందితులైన హరియాణాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ కశ్యప్, యూపీకి చెందిన శివకుమార్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో నిందితుల్లో ఒకరైన ధర్మరాజ్ కశ్యప్ తాను … Read more

Thiruvonam Bumper Lottery:  రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఓ మెకానిక్

ఓ మెకానిక్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అదృష్టం తలుపుతట్టింది అన్నట్టు అతడికి భారీ జాక్ పాట్ కాళ్లదగ్గరకు వచ్చి పడింది. అంతే ఊహించని విధంగా డబ్బు వచ్చిపడింది. ఇంకే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్‌  అల్తాఫ్ కు కేరళ తిరువోణం బంపర్ లాటరీ తగిలింది.  దీంతో అత‌డి బ్యాంక్ ఖాతాలోకి రాత్రికి రాత్రే రూ. 25కోట్లు వ‌చ్చి పడ్డాయి. ఆ లాటరీకి సంబంధించిన డ్రాను తిరువ‌నంత‌పురంలోని గోర్కీ భ‌వ‌న్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2 … Read more

Ratan Tata: దార్శనికుడు రతన్ టాటా.. చంద్రబాబు నివాళి

”దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా దార్శనికుడు. ఆ మహనీయుడి సేవాతత్పరతను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుంది.. టాటా స్పూర్తిని మనమంతా కొనసాగించాలి..” అని ఆంధ్రప్రదేశ్ సీయం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముంబాయ్ లో ఎన్సిపిఏ గ్రౌండ్స్లో గురువారం రతన్ టాటా అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా రతన్ టాటా దేశానికి చేసిన సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. పారిశ్రామిక వేత్త్తలు టాటాల మాదిరిగా నైతికంగా సంస్తలను నిర్వహించాలని హితవు పలికారు.

Ratan Tata – Funeral-Last rites: రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి

పారిశ్రామిక దిగ్గజం, మానవతావాది రతన్ టాటా అంత్యక్రియలు ముంబయిలోని వర్లి శ్మశానవాటికలో ముగిసాయి. మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహించింది. మహారాష్ట్ర సర్కార్ అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. రతన్‌ టాటా అంతర్జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పి లక్షలాది మందికి ఉపాధి కల్పించి, తన సంపాదనలో 60 శాతానికిపైగా పేదల సంక్షేమానికి ఖర్చు పెట్టారు. రెండు దశాబ్దాలకు పైగా టాటా గ్రూప్‌నకు అధిపతిగా … Read more