Lawrence Bishnoi Gang: ముంబయిని గడగడలాడిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్

ముంబయి: ముంబయి అండర్‌ వరల్డ్‌ మళ్లీ యాక్టీవ్‌ అయ్యిందా అంటే అవును అనే సమాధానమే వస్తోంది. గతంలో ముంబై చీకటి సాజ్రమ్యాన్ని లీడ్ చేసిన డీ-కంపెనీ దాదాపు ఫేడవుట్ అయిపోవడంతో ఇప్పుడు కొత్త గ్యాంగ్ ఎంటరైంది. అండర్‌ వరల్డ్ కి నయా దావూద్‌ వచ్చాడు. అతను ఉండేది జైల్లో అయినా జరిగే హత్యలు జరిగిపోతుంటాయి. కటకటాల్లో ఉంది కూడా ఏడు దేశాల్లో నెట్‌వర్క్‌ మెయింటేన్‌ చేస్తున్నాడు. ఫైనాన్స్ క్యాపిటల్‌ని గడగడలాడిస్తున్న ఈ కిల్లర్‌ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు..? దావూద్‌ని రీప్లేస్‌ చేయాలనుకుంటున్నాడా..? అతని హిట్‌ లిస్ట్ లో ఇంకా ఎవరున్నారు..? ఇదే ఇప్పుడు పోలీసులకు నిద్రలేకుండా చేస్తోంది.

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌.. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న కొత్త కటౌట్ ఇది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. గత కొన్నేళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. దేశంలో తీవ్ర అశాంతిని నెలకొల్పుతుండటంతో మరోసారి నైన్టీస్లో దేశాన్ని వణికించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గుర్తుకు వస్తున్నాడు. దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-కంపెనీతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను పోల్చింది. చిన్న చిన్న నేరాలతో నెట్‌వర్క్ ను విస్తరించిన దావూద్ ఇబ్రహీం లాగే లారెన్స్ బిష్ణోయ్ కూడా ఉగ్రవాద సిండికేట్‌గా పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ అనుమానం. డ్రగ్స్ అక్రమ రవాణా, టార్గెట్ కిల్లింగ్స్, దోపిడీ రాకెట్ల ద్వారా దావూద్ ఇబ్రహీం తన నెట్‌వర్క్ ను విస్తరించి.. ఆ తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి డీ-కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇక అదే రకంగా చిన్న చిన్న నేరాలతో మొదలైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. ప్రస్తుతం ఉత్తర భారతదేశాన్ని శాసిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.