Ratan Tata: దార్శనికుడు రతన్ టాటా.. చంద్రబాబు నివాళి

”దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా దార్శనికుడు. ఆ మహనీయుడి సేవాతత్పరతను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుంది.. టాటా స్పూర్తిని మనమంతా కొనసాగించాలి..” అని ఆంధ్రప్రదేశ్ సీయం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముంబాయ్ లో ఎన్సిపిఏ గ్రౌండ్స్లో గురువారం రతన్ టాటా అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా రతన్ టాటా దేశానికి చేసిన సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. పారిశ్రామిక వేత్త్తలు టాటాల మాదిరిగా నైతికంగా సంస్తలను నిర్వహించాలని హితవు పలికారు.