Gachibowli: ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం.. ప్రాణ భయంతో జనం

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఓ నాలుగు అంతస్తుల భవనం మంగళవారం రాత్రి పక్కకు ఒరిగింది. బిల్డింగ్ కూలిపోతోందని భయాందోళనలకు గురైన జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ లో ఉంటున్న వారు ఉన్నపళంగా బయటపడ్డారు.  మణికొండకు చెందిన లక్ష్మణ్ రెండేళ్ల క్రితం సిద్ధిఖీ నగర్ లో తనకున్న 60 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవనం నిర్మించాడు. అందులో పలు కుటుంబాలు కిరాయికి ఉంటున్నాయి. మొత్తం 30 మంది ఆ బిల్డింగ్ లో ఉంటున్నారు. … Read more

Patnam Narender Reddy: పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు సీరియస్

లగచర్లలో అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన తీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వాకింగ్ కోసం కేబీఆర్ పార్కుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా తరలించారు. దీనిపై బీఆర్ఎస్ మండిపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం … Read more

Ramcharan: దర్గాను సందర్శించిన రామ్ చరణ్‌పై విమర్శలు

టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శింకున్చనారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన భార్య ఉపాసన స్పందించారు. రామ్ చరణ్ దర్గాను సందర్శించిన ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన ఉపాసన.. ‘‘విశ్వాసం ఒక్కటి చేస్తుంది.. అదెప్పుడూ విడదీయదు. భారతీయులుగా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలను గౌరవించాలి. ఐక్యతలోనే బలం ఉంది. రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలను గౌరవిస్తారు’’  అని పేర్కొన్నారు.   ఉపాసన పోస్టుకు ఓ నెటిజన్ స్పందిస్తూ.. … Read more

Aghori: హైవేపై బైఠాయించిన అఘోరి..

ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో మహిళా అఘోరి హల్ చల్ చేసింది. జనసేన ఆఫీసు సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కల్యాణ్ ను కలిసేదాకా కదలనని తేల్చిచెప్పింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అఘోరి చేయిచేసుకుంది. అంతకుముందు మంగళగిరిలోని ఓ కార్ వాష్ సెంటర్ లో అఘోరి తన కారును శుభ్రం చేయించుకుంది. ఆ సమయంలో అక్కడున్న ఓ జర్నలిస్టు … Read more

air india: ఎయిరిండియా అదనపు సర్వీసులు

తెలుగు రాష్ట్రాల విమాన ప్రయాణీకులకు ఎయిరిండియా గుడ్ న్యూస్ చెప్పింది. శీతాకాల సర్వీసుల్లో భాగంగా అదనపు సర్వీసులను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి అదనపు సర్వీసులను ప్రకటించడంతో ఈ మూడు నగరాల నుంచి వారంలో నడిచే సర్వీసుల సంఖ్య 173 నుండి 250కి పెరిగాయి. కొత్తగా ప్రకటించిన సర్వీసుల్లో హైదరాబాద్ – గ్వాలియర్ డైరెక్ట్ సర్వీస్, విశాఖపట్నం – విజయవాడ సర్వీస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసుల సంఖ్య పెంచారు. అలానే … Read more

Samshabad: షార్జా విమానానికి బాంబు బెదిరింపు

హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయంలో ఫైట్ ఎక్కిన ఓ ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందంటూ కేకలు వేశాడు. విమానాశ్రయ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, అతనిని, లగేజీని తనిఖీ చేశారు. కానీ ఎలాంటి బాంబును గుర్తించలేదు. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. మొదట వారిని కిందకు దించారు. విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. నిన్న నాగపూర్ విమానానికి కూడా ఓ బాంబు బెదిరింపు వచ్చింది. గత కొన్నిరోజులుగా పదులు, … Read more

Komatireddy Venkat Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు: మంత్రి కోమటిరెడ్డి

మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. దశాబ్దాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు కాళ్లు, చేతులు వంకరలు పోయి, క్యాన్సర్ వంటి జబ్బులతో చచ్పిపోతుంటే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని దాదాపు కోటిన్నర మంది జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన మూసీ ప్రక్షాళనను అన్యాయంగా అడ్డుకొని తమను బద్నాం చేయాలని చూస్తున్నారని  విపక్షాలపై ఆగ్రమం వ్యక్తం చేశారు. అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని, … Read more

తెలంగాణ -టు- అరుణాచలం

కార్తీక మాసంలో అరుణాచలేస్వరుడి దర్సనం కోసం తహతహలాడే వారి కోసం తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి తమిళనాడులోని అరుణాచలం వరకు స్పెషల్ బస్సులు నడపడానికి సన్నాహాలు చేసారు . హైదరాబాద్ లో ఈ నెల 13 న బస్సులు బయలుదేరతాయ్. హైదరాబాద్ తో పాటు తెలంగాణ లో ఇతర ప్రాంతాల నుంచి కూడా బస్సులను అరుణాచలానికి నడుపుతున్నారు .  13న బయలుదేరే భక్తులకు 14, 15 తేదీలలో అరుణాచలం శివుడి దర్శనం ,  … Read more

Hyderabad Metro: రెండో దశ మెట్రో రైలు నిర్మాణానికి అనుమతులు

హైదరాబాద్ లో మెట్రోరైలు చాలా విజయవంతమైంది. హైదరాబాద్ రూపురేకలను మార్చడంలోను, ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ప్రజలను బయటపడేయడంలోను  మెట్రోరైలు చాలా కీలకంగా మారిందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మెట్రోకు ముందు హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే మొదటి దశలో భాగంగా చాలా ప్రాంతాలకు విస్తరించారు. ఈ క్రమంలో రెండో  దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. ఈ  దశలో 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.24,269 … Read more

Ethics for Others: ఆంధ్రజ్యోతిలో డిష్యూమ్.. డిష్యుమ్…

”ఈనాడు  నుంచి మంచి పొజిషన్ వదులుకుని వచ్చాను. పత్రిక అభివృద్ధికి శక్తివంచన లేకుండా ప్రణాళికతో పనిచేసాను .  టీమ్ తో సమర్ధవంతంగా చేయించాను .  చేయిస్తున్నాను. ఇరవై ఏళ్ల నుంచీ నిబద్దతతో ,  నిజాయితీగా పనిచేస్తున్న నన్ను పక్కన పెట్టి ఇటీవల వచ్చి చేరిన అతనికి ఎడిటర్ పోస్ట్ ఇచ్చేస్తారా? ఇది మీకు నైతికత అనిపిస్తోందా.” అంటూ మదనపడుతున్నారట  ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ వక్కలంక రమణ. అక్టోబర్ 19 ”ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఎందుకు వెళ్లిపోతున్నారు ‘ ‘ … Read more