జగన్ సీఎంగా ఉన్నపుడు తాము ఐపిఎస్ అధికారులమన్న స్ఫహ లేకుండా ఇష్టానుసారం వ్యవహరించిన పోలీస్ ఉన్నతాధికారుల గుట్టును గూగుల్ రట్టు చేస్తోంది . .
ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో గుట్టును గూగుల్ టేకౌట్ రట్టు చేసింది. ఐపీఎస్ అధికారులు, వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రూపొందించిన కుట్ర కోణాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో దర్యాప్తు అధికారులు పసిగట్టారు.
ముంబై నటిపై వేధింపులకు అక్కడే స్కెచ్ వేసినట్లు నిర్దారణ అయినట్లు తెలుస్తోంది .
సదరు ఐపీఎస్లకు, కుక్కల విద్యాసాగర్ మధ్య మెసేజ్లు సైతం బయటపడ్డాయి .
టెక్నాలజీ సాయంతో పసిగట్టిన దర్యాప్తు బృందం
ఆ ముగ్గురు ఐపీఎస్లకు బిగుస్తున్న ఉచ్చు
నాటి ముఖ్యమంత్రి జగన్ స్నేహితుడిని రక్షించేందుకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్
పీఎ్సఆర్ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీ, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేసిన పథక రచనకు సంబంధించిన కీలకమైన డిజిటల్ ఆధారాలు దర్యాప్తు అధికారుల చేతికి చిక్కాయి. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఎంతటి వ్యక్తులున్నా వదలవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ముంబై నటి జెత్వానీ తన తల్లితో కలిసి విజయవాడకు వచ్చి తనకు నాడు జరిగిన అన్యాయం, వేధించిన వ్యక్తులు, ఇబ్బంది పెట్టిన అధికారులపై పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన సూచన మేరకు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఆమె రాతపూర్వక ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అందులో మొదటి నిందితుడిగా ఉన్న కుక్కల విద్యా సాగర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం టెక్నాలజీ ప్రయోగించడంతో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. ఆయన సెల్ నెంబర్ ఆధారంగా ఎక్కడున్నారో కూపీలాగే ప్రయత్నంలో గూగుల్ టేకౌట్ను ప్రయోగించినట్లు తెలిసింది. అయితే ఫిబ్రవరి 2న విద్యాసాగర్ ముంబైలో విశాల్ గున్నీ ఇతర పోలీసులతో కలిసి ఉన్నట్లు కూడా టెక్నాలజీ ఆధారంగా బయటపడింది.