Vijayawada Railway Station Receives NSG 1 Status రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందింస్తున్నందుకు విజయవాడ స్టేషన్ కు అరుదైన ఘనట దక్కింది . ప్రయాణికుల రాకపోకలు, వారికి అందుతున్న సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వేస్టేషన్లను వివిధ కేటగిరీలుగా విభజిస్తుంది. ఏటా రూ. 500 కోట్ల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలు సాగించే స్టేషన్లకు ఎన్ఎస్జీ (NSG-1 -Non Suburban Group 1) హోదా కేటగిరీ ఇస్తారు. దిల్లీ సహా కొన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఉన్న టాప్ రైల్వేస్టేషన్లకు మాత్రమే ఇప్పటి వరకు ఈ హోదా ఉండగా తాజాగా విజయవాడ రైల్వేస్టేషన్ ఆ జాబితాల చేరింది. కేంద్ర ప్రభుత్వం విజయవాడ రైల్వేస్టేషన్‌ను ఎన్ఎస్జీ 1 హోదా కేటాయించింది. రాష్ట్రంలో ఈ హోదా కలిగిన ఏకైక రైల్వేస్టేషన్ ఇదొక్కటే.