” చేసిన తప్పుకైనా క్షమాపణ చెప్పడం ఇప్పటి తరం రాజకీయ నేతలకు అస్సలు ఉండడటలేదు. అలాంటిది ఏ తప్పు చేయని మన ప్రధాని మోదీ క్షమాపణలు ఎందుకు చెప్పారు ? ”
ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై (Shivaji statue collapse) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) క్షమాపణలు తెలిపారు. ”ఛత్రపతి మహారాజ్‌ను దైవంగా భావించే వారు ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు . ., వారికి తలవంచి క్షమాపణలు చెబుతున్నా” అని మోదీ ఉద్వగంగా అన్నారు. దైవం కంటే ఏదీ గొప్పది లేదని తెలిపారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా మాల్వాన్‌లో శుక్రవారం పర్యటించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, క్షమాపణలు చెప్పే నైజం విపక్షాలకు లేకున్నా తాను మాత్రం శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై క్షమాపణలు తెలియజేస్తున్నానని అన్నారు.
సింధ్‌దుర్గ్ జిల్లాలో గత ఏడాది డిసెంబర్లో నేవీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహం ఆగస్టు 26న కూప్పకూలింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించడంతో పాటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాజీనామాకు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో మోదీ శుక్రవారం పర్యటించారు. ”మాకు ఛత్రపతి శివాజీ అంటే కేవలం ఒక పేరు కాదు, దైవం. మా దైవానికి తలవంచి క్షమాపణ చెప్పుకుంటున్నాను. మాకు భిన్నమైన విలువలు ఉన్నాయి. ఈ గడ్డలో లో పుట్టిన భరతమాత పుత్రుడు వీర సావార్కర్‌ను నిరంతరం అవమానించే కొందరి వ్యక్తుల తరహాలో మేము ఉండం. వాళ్లు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా లేరు. కోర్టులకు వెళ్లేందుకు, పోరాడేందుకే సిద్ధంగా ఉంటారు” అని విపక్షాల తీరును మోదీ తీవ్రంగా దుయ్యబట్టారు .