కోహ్లీ టీం (Kohli Team) ఆఫర్ ఇస్తే తిరస్కరించాడట ఓ బౌలర్. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? ఆయనే ఆస్ట్రేలియా ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ నాథన్ బ్రాకెన్(Fast bowler Nathan Bracken). అంతేకాదు నాథన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీ(IPL Franchise RCB)కోట్లు ఖర్చు చేసినప్పటికీ తాను మాత్రం లీగ్ ఆడేందుకు నిరాకరించాడు. ఆ విధంగా కోట్ల ఆఫర్ ను తిరస్కరించిన ప్లేయర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం.
2011 వ సంవత్సరంలో మోకాలికి గాయం కావడంతో క్రికెట్ కు నాథన్ బ్రాకెన్ రిటైర్మెంట్ (Retirement) ప్రకటించారు. అయితే ఆ తరువాత ఐపీఎల్ లో ఆర్సీబీ టీమ్ రూ.1.3కోట్లతో ఒప్పందం కుదుర్చుకోవాలని భావించగా.. ఈ లెఫ్టార్మ్ ఆస్ట్రేలియా బౌలర్ దాన్ని తిరస్కరించారు. ఆయన ప్రస్తుతం సిడ్నీలోని ఓ కంపెనీలో అకౌంట్ మేనేజర్ (Account Manager) గా పని చేస్తున్నాడు.
కాగా బ్రాకెన్ క్రికెట్ కు దూరమై దశాబ్దానికి పైగా గడిచింది. 2009 లో ఆస్ట్రేలియా తరపున చివరి మ్యాచ్ ఆడిన ఆయన అత్యధికంగా వన్డేల్లో 174 వికెట్లు పడగొట్టాడు.